Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

HPV Vaccine | టీకాతో సర్వైవ్.. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో సర్వైకల్‌ క్యాన్సర్‌కు చెక్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 19, 2024No Comments

ప్రపంచాన్ని కబళిస్తున్న మహమ్మారుల్లో క్యాన్సర్‌ ఒకటి. ఏ రూపంలో దాడి చేసినా.. క్యాన్సర్‌ బాధితులు వేగంగా మరణానికి చేరువ అవుతుంటారు. అత్యాధునిక ఔషధాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా… అవి రోగి జీవితకాలాన్ని పెంచగలుగుతున్నాయే కానీ, క్యాన్సర్‌ను రూపుమాపడం లేదు.

March 19, 2024 / 08:22 AM IST
HPV Vaccine | టీకాతో సర్వైవ్.. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో సర్వైకల్‌ క్యాన్సర్‌కు చెక్‌

ప్రపంచాన్ని కబళిస్తున్న మహమ్మారుల్లో క్యాన్సర్‌ ఒకటి. ఏ రూపంలో దాడి చేసినా.. క్యాన్సర్‌ బాధితులు వేగంగా మరణానికి చేరువ అవుతుంటారు. అత్యాధునిక ఔషధాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా… అవి రోగి జీవితకాలాన్ని పెంచగలుగుతున్నాయే కానీ, క్యాన్సర్‌ను రూపుమాపడం లేదు. అయితే, ముందస్తు నివారణ చర్యలతో కొన్ని రకాల క్యాన్సర్ల బారినపడకుండా ఉండొచ్చని అంటున్నారు వైద్య నిపుణులు. వాటిలో మహిళలను పీడిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ఒకటి. ఇతర ఏ రకమైన క్యాన్సర్‌ వ్యాధుల నివారణకు లేని వెసులుబాటు ఈ సర్వైకల్‌ క్యాన్సర్‌కు ఉంది. ముందస్తు టీకాతో సర్వైకల్‌ క్యాన్సర్‌ బారినపడకుండా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. అసలు ఇంతకీ ఈ క్యాన్సర్‌ ఎందుకు వస్తుంది? ఎవరికి వస్తుంది? వ్యాధి కారణాలు, లక్షణాలు, నిర్ధారణ పద్ధతులు, అందుబాటులో ఉన్న చికిత్స విధానాల గురించి తెలుసుకుందాం..

HPV Vaccine | గర్భాశయ ముఖద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్‌ను సర్వైకల్‌ క్యాన్సర్‌ అంటారు. గర్భాశయానికి కింది భాగంలో ఉండే సన్నని ప్రదేశం గర్భాశయానికి ముఖద్వారంగా పనిచేస్తుంది. ఇదే గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది. సర్వైకల్‌ క్యాన్సర్‌ను ఇతర క్యాన్సర్ల కన్నా సులభంగా నివారించవచ్చు. అయితే, దేశంలో ఈ క్యాన్సర్‌ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఏటా సుమారు లక్షన్నర వరకు సర్వైకల్‌ క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి. 2025 నాటికి ఈ సంఖ్య దాదాపు రెండున్నర లక్షలకు చేరవచ్చని అంచనా. అంతేకాదు, సర్వైకల్‌ క్యాన్సర్‌ వల్ల ప్రతీ సంవత్సరం వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వ్యాధి నివారణ కోసం టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ చాలామంది అవగాహనా లోపంతో టీకా తీసుకోకుండా సర్వైకల్‌ క్యాన్సర్‌బారినపడుతున్నారు.

ముందస్తు టీకాతో..

ఇతర ఏ రకమైన క్యాన్సర్‌ వ్యాధుల నివారణకు లేని వెసులుబాటు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ఉండటం అదృష్టంగా భావించొచ్చు. ముందస్తుగా టీకా తీసుకుంటే సర్వైకల్‌ క్యాన్సర్‌ దరి చేరదు. సాధారణంగా 50 ఏండ్లు నిండిన మహిళల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. పీఏపీ (పపనికోలౌ) స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని నిర్ధారించే అవకాశాలు ఉంటాయి. 21 ఏండ్లు నిండిన యువతులు, దాంపత్య జీవితాన్ని ప్రారంభించి మూడేండ్లు గడిచిన మహిళలు పీఏపీ పరీక్ష చేయించుకోవాలి. దీనిద్వారా సర్వైకల్‌ క్యాన్సర్‌ను గుర్తించి, తక్షణ వైద్యం పొందడానికి వీలు ఉంటుంది.

వ్యాధికి గల కారణాలు

హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) వల్ల సర్వైకల్‌ క్యాన్సర్‌ వస్తుంది. ఇది శృంగారం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. అయితే వైరస్‌ సోకిన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్‌ రాదు. వారిలో కొందరికి మాత్రమే సర్వైకల్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే సెక్స్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హెచ్‌పీవీ సోకే అవకాశాలు ఉంటాయి. కాకపోతే చిన్న వయసులో శృంగారంలో పాల్గొనడం, ఎక్కువ మందితో సెక్స్‌ చేయడం, అలాంటి వ్యక్తులతో కలవడం వల్ల హెచ్‌పీవీ సోకే అవకాశాలుఅధికంగా ఉంటాయి. హెచ్‌పీ వైరస్‌లో 100కు పైగా రకాలు ఉన్నాయి. వీటిని హెచ్‌పీవీ 1, 2, 3 ఇలా సంఖ్యానామంతో పిలుస్తారు. వీటిని ప్రధానంగా మూడు రకాలుగా పరిగణిస్తారు. మొదటిది హై రిస్క్‌ హెచ్‌పీవీ, రెండోది లోరిస్క్‌ హెచ్‌పీవీ, మూడోది సాధారణ హెచ్‌పీవీ.

Cancer

హై రిస్క్‌ హెచ్‌పీవీ

సాధారణంగా హెచ్‌పీవీ వైరస్‌ దానంతట అదే తగ్గిపోతుంది. దీనినే సాధారణ హెచ్‌పీవీ అంటారు. కానీ, అలా తగ్గిపోకుండా.. కొంతకాలం తరువాత అది క్యాన్సర్‌కి దారితీసే అవకాశాలుంటాయి. ఈ విధంగా తీవ్రమైన క్యాన్సర్‌లకు దారితీసే హెచ్‌పీవీ 16, హెచ్‌పీవీ18లను హైరిస్క్‌ హెచ్‌పీవీ వ్యాధులుగా పరిగణిస్తారు. ఇవి కాకుండా హెచ్‌పీవీ 31, 33, 45, 52, 58 రకాలు సైతం తీవ్ర క్యాన్సర్‌ వ్యాధులకు దారితీస్తాయి. ఈ హైరిస్క్‌ హెచ్‌పీవీలు 70 శాతం గర్భాశయ క్యాన్సర్‌లకు కారణమవుతాయి. అంతేకాదు, ధూమపానం, ఎయిడ్స్‌, ఐదు సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం గర్భ నిరోధక మాత్రలు వాడటం, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలకు జన్మనిచ్చిన వారికి సంక్రమించే హెచ్‌పీవీ సర్వైకల్‌ క్యాన్సర్‌కు దారితీసే అవకాశాలు ఎక్కువ.

లో రిస్క్‌ హెచ్‌పీవీ

హెచ్‌పీవీ 6, హెచ్‌పీవీ11 వంటివి తక్కువ ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు. లో రిస్క్‌ హెచ్‌పీవీ ద్వారా సంక్రమించే వ్యాధులు 90 శాతం రోగుల జననేంద్రియాలపై దద్దుర్లకు కారణమవుతాయి. చాలా అరుదుగా ఇవి క్యాన్సర్‌గా మారుతాయి. ఈ వ్యాధి ఉన్నవారితో శారీరకంగా కలిసినప్పుడు కొన్ని వారాలు, నెలల తర్వాత జననేంద్రియాలపై మొటిమల్లాంటి దద్దుర్లు కనిపించవచ్చు.

వ్యాధి లక్షణాలు

సాధారణంగా హెచ్‌పీవీ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకని చాలామందికి అసలు ఈ వ్యాధి సోకినట్లే తెలియదు. ఇలా లక్షణాలు కనిపించకపోవడమే రోగి కొంపముంచుతున్నది. ఎందుకంటే వ్యాధి ముదిరే వరకు గుర్తించకపోవడం వల్ల చివరి దశలో చాలామంది బాధితులు దవాఖానలకు పరుగులు తీస్తున్నారు.

నివారణ మార్గాలు

  • 21 సంవత్సరాలు నిండిన లేదా సెక్స్‌లో పాల్గొనడం ప్రారంభించి మూడేండ్లు గడిచిన ప్రతి మహిళ పీఏపీ స్క్రీనింగ్‌ పరీక్ష చేయించుకోవాలి.
  • 9-18 మధ్య వయసు బాలికలు, యువతులు తప్పకుండా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తీసుకోవాలి
  • 6 నెలల వ్యవధిలో 3 సార్లు హెచ్‌పీవీ టీకా తీసుకోవాలి
  • జీవిత భాగస్వామితో మాత్రమే దాంపత్య జీవితాన్ని గడపాలి.
  • ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది.

– డాక్టర్‌ జయలత ప్రిన్సిపల్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, సూర్యాపేట

– మహేశ్వర్‌రావు బండారి

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.