IAF Daring Airlift Operation | చేయి తెగిన జవాన్‌ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) సిబ్బంది కాపాడారు. రాత్రివేళ డేరింగ్ ఆపరేషన్ నిర్వహించి అతడ్ని ఆసుపత్రికి తరలించారు. దీంతో డాక్టర్లు ఎనిమిది గంటలు శ్రమించి సర్జరీ ద్వారా తెగిన చేతిని అతికించారు. ఆ జవాన్ కోలుకుంటున్నాడని తెలిపారు.

న్యూఢిల్లీ: చేయి తెగిన జవాన్‌ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) సిబ్బంది కాపాడారు. రాత్రివేళ డేరింగ్ ఆపరేషన్ నిర్వహించి అతడ్ని ఆసుపత్రికి తరలించారు. దీంతో డాక్టర్లు ఎనిమిది గంటలు శ్రమించి సర్జరీ ద్వారా తెగిన చేతిని అతికించారు. ఆ జవాన్ కోలుకుంటున్నాడని తెలిపారు. (IAF Daring Airlift Operation) జమ్ముకశ్మీర్‌లోని లడఖ్ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఒక సైనికుడు మెషిన్ ఆపరేట్ చేస్తుండగా చేయి తెగింది.
కాగా, ఆర్మీ ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఐఏఎఫ్ వెంటనే స్పందించింది. చేయి తెగిన జవాన్‌ను కాపాడేందుకు నడి రాత్రి వేళ డేరింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఆ జవాన్‌ను సీ-130జే విమానంలో లడఖ్ నుంచి ఢిల్లీకి తరలించారు. తక్కువ కాంతిలో చూసే ఆప్టోఎలక్ట్రానిక్ పరికరాలైన నైట్ విజన్ గాగుల్స్ వంటివి ఈ డేరింగ్ ఆపరేషన్ కోసం వినియోగించారు.
మరోవైపు ఢిల్లీలోని ఆర్ అండ్ ఆర్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్లు కూడా వెంటనే స్పందించారు. సుమారు ఎనిమిది గంటలు శ్రమించి సర్జరీ చేశారు. తెగిన జవాన్ చేతిని విజయవంతంగా అతికించారు. ఆ జవాన్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని డాక్టర్లు తెలిపారు. ఐఏఎఫ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.