IND vs ENG 2nd Test : వైజాగ్ టెస్టులో భారత జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. యువకెరటం శుభ్‌మన్ గిల్(60 నాటౌట్ : 78 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్) హాఫ్ సెంచరీ బాదడంతో పటిష్ఠ స్థితిలో నిలిచిన టీమిండియా…
IND vs ENG 2nd Test : వైజాగ్ టెస్టులో భారత జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. యువకెరటం శుభ్‌మన్ గిల్(60 నాటౌట్ : 78 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్) హాఫ్ సెంచరీ బాదడంతో పటిష్ఠ స్థితిలో నిలిచిన టీమిండియా లంచ్ టైమ్‌కు 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ప్రస్తుతానికి రోహిత్ సేన 273 పరుగుల ఆధిక్యంలో ఉంది. అక్షర్ పటేల్(2) క్రీజులో ఉన్నాడు.
ఉప్పల్‌లో జరిగిన తొలి టెస్టులో విఫలైమన గిల్.. వైజాగ్ మ్యాచ్‌లో విలువైన ఇన్నింగ్స్‌తో జట్టును గట్టెక్కించాడు. 35 పరుగులకే 2 వికెట్లు పడిన దశలో.. ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్న గిల్ తనదైన షాట్లతో అలరించాడు.
Lunch on Day 3 of the Vizag Test!#TeamIndia added 102 runs in First Session to move to 130 & lead England by 273 runs.
Stay Tuned for Second Session ⌛️
Scorecard ▶️ https://t.co/X85JZGt0EV#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/97XEC78cz4
— BCCI (@BCCI) February 4, 2024
మూడో వికెట్‌కు శ్రేయస్ అయ్యర్(29)తో 81 పరుగులు జోడించిన గిల్ భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. అయితే.. ఆ తర్వాతి ఓవర్లోనే టామ్ హర్ట్లే బౌలింగ్‌లో అయ్యర్ భారీ షాట్ ఆడగా.. బెన్ స్టోక్స్ పరుగెత్తుతూ వెళ్లి డైవింగ్ క్యాచ్ పట్టాడు. దాంతో, ఇండియా 111 రన్స్ వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్ (9) కుదురుకున్నట్టే కనిపించినా.. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో కీపర్ చేతికి చిక్కాడు.