Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

IPL 2024 | ఐపీఎల్‌లో సౌతాఫ్రికా సంచలనం.. ఆ జట్టుకు ఆడనున్న యువ పేసర్‌!-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 20, 2024No Comments

IPL 2024 | ఐసీసీ అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌లో తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన దక్షిణాఫ్రికా యువ పేసర్‌ క్వెన మఫక ఐపీఎల్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడా..?

March 20, 2024 / 08:57 PM IST
IPL 2024 | ఐపీఎల్‌లో సౌతాఫ్రికా సంచలనం.. ఆ జట్టుకు ఆడనున్న యువ పేసర్‌!

IPL 2024 | కొద్దిరోజుల క్రితమే సౌతాఫ్రికా వేదికగా ముగిసిన ఐసీసీ అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌లో తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన దక్షిణాఫ్రికా యువ పేసర్‌ క్వెన మఫక ఐపీఎల్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. అండర్‌ – 19 వరల్డ్‌కప్‌లో అంచనాలకు మించి రాణించిన 17 ఏండ్ల మఫక.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడనున్నట్టు సమాచారం. ఈ మేరకు అతడు ఇప్పటికే ముంబైలో ల్యాండ్‌ అయ్యాడని, జట్టుతో కలిసినట్టు సోషల్‌ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌లో 21 వికెట్లు పడగొట్టిన మఫక.. క్రికెట్‌ సౌతాఫ్రికా (సీఎస్‌ఎ) టీ 20 చాలెంజ్‌లో భాగంగా లయన్స్‌ తరఫున ఆడాడు. ఆ టోర్నీలో కూడా రాణించాడు. సౌతాఫ్రికా తరఫున భావి రబాడాగా ప్రశంసలు దక్కించుకుంటున్న మఫక.. ముంబైకి ఆడనున్నట్టు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ అయిన ఎస్‌ఎ20లో ఎంఐ కేప్‌టౌన్‌ తరఫున ఆడే రబాడా చొరవతో ముంబై.. మఫకను సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ యువ పేసర్‌ను నెట్‌ బౌలర్‌గా వాడుతారా..? లేక నేరుగా మ్యాచ్‌లలో ఆడిస్తారా..? అనేది మాత్రం తేలాల్సి ఉంది.

 

Looks like Kwena Maphaka will join up with Mumbai Indians for #IPL2024 . The extent of his involvement is unclear but he could be there on an apprenticeship. Fantastic news this. He’ll learn so much in that environment.

Credit: @shockerhess #CricketTwitter pic.twitter.com/TD2ykOzldr

— Lawrence Bailey ⚪ 🇿🇦 (@LawrenceBailey0) March 20, 2024

ఒకవేళ అతడిని ఐపీఎల్‌లో ఆడించినా ప్రస్తుతం పాఠశాల విద్యను అభ్యసిస్తున్న మఫక కోసం ముంబై ప్రత్యేక ఏర్పాట్లను చేయనుందట. అతడి చదువుకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను ముంబై జాగ్రత్తలు తీసుకోనుందని సమాచారం. మఫక ఈనెల 19నే ముంబైకి వచ్చాడని వార్తలు వస్తున్నాయి. దీనిపై ముంబై ఇండియన్స్‌ త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించే అవకాశముంది.

 

Kwena Maphaka Becomes Mumbai Indians Net Bowler 🔥 pic.twitter.com/ze5z99kpmR

— Junaid Khan (@JunaidKhanation) March 20, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.