IPL 2024 : సన్ రైజర్స్ హైదరాబాద్.. భగభగమండే నిప్పు కణికలను పోలిన జెర్సీకి తగ్గ ఆటతీరుతో చెలరేగిపోతోంది. ఐపీఎల్ 17వ సీజన్(IPL 2024)లో ప్యాట్ కమిన్స్ సేన రికార్డుల పర్వం కొనసాగిస్తోంది. 287 పరుగులతో చరిత్ర పుటల్లోకెక్కిన సన్‌రైజర్స్.. ఆర్సీబీకి కొండంత లక్ష్యాన్ని అప్పగించింది.

IPL 2024 : సన్ రైజర్స్ హైదరాబాద్.. భగభగమండే నిప్పు కణికలను పోలిన జెర్సీకి తగ్గ ఆటతీరుతో చెలరేగిపోతోంది. ఐపీఎల్ 17వ సీజన్(IPL 2024)లో ప్యాట్ కమిన్స్ సేన రికార్డుల పర్వం కొనసాగిస్తోంది. ముంబై ఇండియన్స్(Mumbai Indians)పై ఉప్పల్ స్టేడియంలో 277 రన్స్ బాది రికార్డు స్కోర్ కొట్టిన సన్‌రైజర్స్ ఐపీఎల్ చరిత్రను తిరగరాసింది. 20 రోజుల వ్యవధిలోనే ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు పరుగుల దాహం తీరలేదన్నట్టు చెలరేగారు.
చిన్నస్వామి స్టేడియంలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102), ఖతర్నాక్ క్లాసెన్(69) బౌండరీల వర్షం కురిపించగా.. కుర్రాడు అబ్దుల్ సమద్(37 నాటౌట్) ఆర్సీబీ బౌలర్లను ఉతికారేశాడు. దాంతో, 287 పరుగులతో చరిత్ర పుటల్లోకెక్కిన సన్‌రైజర్స్.. ఆర్సీబీకి కొండంత లక్ష్యాన్ని అప్పగించింది. అంతేనా బోలెడన్ని రికార్డులను తన పేర రాసుకుంది.
🚨 𝗧𝗵𝗲 𝗥𝗲𝗰𝗼𝗿𝗱 𝗶𝘀 𝗯𝗿𝗼𝗸𝗲𝗻 𝗮𝗴𝗮𝗶𝗻 🚨@SunRisers continue to hold the record for the highest total in IPL history 🧡🔥
2⃣8⃣7⃣/3⃣#TATAIPL | #RCBvSRH pic.twitter.com/5VOG8PGB6X
— IndianPremierLeague (@IPL) April 15, 2024
ఆర్సీబీపై 287 పరుగులు బాదిన హైదరాబాద్ జట్టు టీ20ల్లో రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. నిరుడు మంగోలియాపై 314 పరుగులతో రికార్డు సృష్టించిన నేపాల్ టాప్‌లో ఉంది. ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా హెస్ఆర్‌హెచ్ మరో రికార్డు ఖతాలో వేసుకుంది.
నేపాల్ జట్టు(314/3)

12 ఏండ్ల రికార్డు బద్ధలు
బెంగళూరుపై సిక్సర్ల వర్షం కురిపించిన హైదరాబాద్ బ్యాటర్లు 22 సార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపారు. దాంతో, 2013లో పూణే వారియర్స్(Pune Warriors)పై ఆర్సీబీ(RCB) కొట్టిన 21 సిక్సర్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(Travis Head) ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన నాలుగో క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో 30 బంతుల్లో శతకం సాధించిన విండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
