IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మూడో విజయంపై కన్నేసింది. ఏప్రిల్ 5న ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్‌తో జరుగబోయే మ్యాచ్‌కు ముందే ఆ జట్టుకు భారీ షాక్ తగలనుంది. ఈ సీజన్‌లో అదరగొడుతున్న స్టార్ పేసర్…
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మూడో విజయంపై కన్నేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్(SunRisers Hyderabad)తో మ్యాచ్ కోసం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న సీఎస్కే ఆటగాళ్లు నెట్స్‌లో శ్రమిస్తున్నారు. ఏప్రిల్ 5న ఉప్పల్ స్టేడియంలో జరుగబోయే మ్యాచ్‌కు ముందే ఆ జట్టుకు భారీ షాక్ తగలనుంది. ఈ సీజన్‌లో అదరగొడుతున్న స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్(Mustafizur Rahman) కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే చాన్స్ ఉంది.
అమెరికా వీసా, బయోమెట్రిక్ కోసం ఈ స్పీడ్‌స్టర్ స్వదేశాని(బంగ్లాదేశ్)కి వెళ్లనున్నాడు. అయితే.. అతడు తిరిగి జట్టుతో కలవడానికి నాలుగైదు రోజులు పట్టొచ్చు. అదే జరిగితే ఏప్రిల్ 8వ తేదీన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌కు సైతం ముస్తాఫిజుర్ దూరమయ్యే చాన్స్ ఉంది.
Masth-e-fizur! 🥳🔥#DCvCSK #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/aYPMzxw4Dn
— Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2024
ఐపీఎల్ పదిహోడో సీజన్ ఆరంభానికి ముందు గాయపడిన ముస్తాఫిజుర్ వేగంగా కోలుకొని చెన్నైకి వచ్చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఆర్సీబీపై సంచలన ప్రదర్శనతో మెరిశాడు. 4 ఓవర్లలో 29 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. అంతేకాదు ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌పై కూడా ముస్తాఫిజుర్ రెండు వికెట్లతో రాణించాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో ఈ పేస్‌గుర్రం ఒకే వికెట్‌తో సరిపెట్టుకున్నాడు. దాంతో, టీ20లో అతడు 300 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.