Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

IPL 2024 MI vs GT

TelanganapressBy TelanganapressMarch 24, 2024No Comments

IPL 2024 MI vs GT : ఐపీఎల్ 17వ సీజ‌న్ ఐదో మ్యాచ్‌లో మాజీ చాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్(Gujarat Titans) అద్భుత విజ‌యం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఐదుసార్లు చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్‌(Mumbai Indians)పై 6 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. అహ్మదాబాద్ స్టేడియంలో 169 ప‌రుగుల‌ స్వ‌ల్ప ఛేద‌న‌లో…

March 24, 2024 / 11:30 PM IST
IPL 2024 MI vs GT | ముంబైని వ‌ణికించిన గుజ‌రాత్.. కెప్టెన్‌గా హిట్ కొట్టిన శుభ్‌మ‌న్

IPL 2024 MI vs GT : ఐపీఎల్ 17వ సీజ‌న్ ఐదో మ్యాచ్‌లో మాజీ చాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్(Gujarat Titans) అద్భుత విజ‌యం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఐదుసార్లు చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్‌(Mumbai Indians)పై 6 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. అహ్మదాబాద్ స్టేడియంలో 169 ప‌రుగుల‌ స్వ‌ల్ప ఛేద‌న‌లో ముంబైని గుజ‌రాత్ పేస‌ర్లు వ‌ణికించారు. చివ‌రి ఓవ‌ర్లో ఉమేశ్ యాద‌వ్ రెండు వికెట్లు తీసి గుజ‌రాత్‌ను గెలిపించాడు. దాంతో, శుభ్‌మ‌న్ గిల్ కెప్టెన్‌గా బోణీ కొట్ట‌గా.. ముంబై సార‌థిగా తొలి మ్యాచ్‌లోనే హార్దిక్ పాండ్యా ఓట‌మి చ‌విచూశాడు.

Now that’s a 𝘾𝙤𝙢𝙚𝙗𝙖𝙘𝙠 😍

Umesh Yadav with the all important wicket of Hardik Pandya when it mattered the most 👏

Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱

Match Updates ▶️ https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI | @gujarat_titans pic.twitter.com/1ijg3ISCCt

— IndianPremierLeague (@IPL) March 24, 2024

ఐపీఎల్ ఫేవ‌రెట్ జ‌ట్ల మ‌ధ్య హోరాహోరీ ఫైట్ ఫ్యాన్స్‌ను అల‌రించింది. 169 ప‌రుగుల ల‌క్ష్యం చిన్న‌దే అయినా.. హిట్ట‌ర్ల‌తో నిండిన‌ ముంబై గెలుపు వాకిట త‌డ‌బ‌డింది. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ డేవిడ్ బ్రెవిస్(46), రోహిత్ శ‌ర్మ‌(43)లు త‌ప్ప మిగ‌తావాళ్లంతా నిరాశ‌ప‌రిచారు. గుజ‌రాత్ పేస‌ర్లు మోహిత్ శ‌ర్మ‌, జాన్స‌న్‌లు సూప‌ర్ స్పెల్‌తో ముంబైని క‌ట్ట‌డి చేశారు.

రోహిత్ ఔట‌య్యాక‌..

12వ ఓవ‌ర్ తొలి బంతికి రోహిత్ ఔట‌య్యే స‌రికి ముంబై 112-3తో ప‌టిష్ట స్థితిలో ఉంది. కానీ, ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన మోహిత్ శ‌ర్మ క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్‌తో ముంబై స్కోర్ బోర్డు నెమ్మ‌దించింది. త‌న మూడో ఓవ‌ర్లో డేంజ‌ర‌స్ బ్రెవిస్‌(46)ను రిట‌ర్న్ క్యాచ్‌తో వెన‌క్కి పంపిన మోహిత్ గుజ‌రాత్‌నో పోటీలోకి తెచ్చాడు.

A 𝕋𝕨𝕚𝕤𝕥 in the 𝕋𝕒𝕝𝕖 😮

Sai Kishore and Mohit Sharma get the well set batters 👌

Which way is this heading? 🤔

Follow the match ▶️https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI | @gujarat_titans pic.twitter.com/H2pD8hh3f6

— IndianPremierLeague (@IPL) March 24, 2024

తిల‌క్ వ‌ర్మ‌(25), టిమ్ డెవిడ్(11)లు.. 12 బంతుల‌కు 27 ర‌న్స్‌కు మారింది. ఆ ద‌శ‌లో స్పెన్స‌ర్ జాన్స‌న్ ఒకే ఓవ‌ర్లో రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను మ‌లుపు తిప్పాడు. క్రీజులోకి వ‌చ్చిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా(11).. 6 బంతుల్లో 19 ర‌న్స్ అవ‌స‌ర‌మ‌వ‌గా తొలి బంతికి సిక్స‌ర్ బాదాడు. ఆ త‌ర్వాత బౌండ‌రీ బాదాడు. మూడో బంతిని మిడ్‌వికెట్‌లో ఆడి క్యాచ్ ఔట‌య్యాడు. నాలుగో బంతికి పీయూష్ చావ్లా(0), ఔట్ కాగా.. ఐదో బంతికి బుమ్రా సింగిల్ తీశాడు. దాంతో, గుజ‌రాత్ 6 ప‌రుగుల తేడాతో గెలిచింది.

Innings Break ‼️

A calming 4️⃣5️⃣ from Sai Sudarshan & a late little cameo from Rahul Tewatia power #GT to 168/6 🙌

Which team will bag 2️⃣ points after tonight? 🤔

Scorecard ▶️https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI pic.twitter.com/tYSJPY6Hcx

— IndianPremierLeague (@IPL) March 24, 2024

సొంత‌ మైదానంలో జ‌రిగిన మ్యాచ్‌లో మాజీ చాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్ స్వ‌ల్ప స్కోర్‌కే ప‌రిమిత‌మైంది. నిర్ణీత ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి ర‌న్స్ కొట్టింది. యువ‌కెర‌టం సాయి సుద‌ర్శ‌న్(45), కెప్టెన్‌ శుభ్‌మ‌న్ గిల్(35)లు రాణించ‌గా.. చివ‌ర్లో ర‌హుల్ తెవాటియా(22) ధ‌నాధ‌న్ ఆడి గుజ‌రాత్‌కు పోరాడ‌గ‌లిగే స్కోర్ అందించాడు. టాస్ ఓడిన గుజ‌రాత్‌కు శుభ్‌మ‌న్ గిల్(35), వృద్ధిమాన్ సాహా(19)లు శుభారంభం ఇచ్చారు. అయితే.. బుమ్రా సూప‌ర్ యార్క‌ర్‌తో సాహాను బౌల్డ్ చేశాడు. ఆ త‌ర్వాత సాయి సుద‌ర్శ‌న్(43) జ‌త‌గా గిల్ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. అంత‌లోనే పీయూష్ చావ్లా గిల్‌ను వెన‌క్కి పంపి గుజ‌రాత్ జోరుకు బ్రేక్ వేశాడు. ఆ కాసేప‌టికే బుమ్రా ఒకే ఓవ‌ర్లో డేంజ‌రస్ డేవిడ్ మిల్ల‌ర్(12), సుద‌ర్శ‌న్‌ను వెన‌క్కి పంపి మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.

ఇవి కూడా చ‌ద‌వండి



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.