Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

IPL 2024 RR vs LSG

TelanganapressBy TelanganapressMarch 24, 2024No Comments

IPL 2024 RR vs LSG : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో మ‌రో మ్యాచ్ ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కూ ఉత్కంఠ‌గా సాగింది.  హోరాహోరీగా జ‌రిగిన‌ పోరులో రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) అద్భుత విజ‌యం సాధించింది. ఆద్యంతం నువ్వానేనా అన్న‌ట్టు సాగిన మ్యాచ్‌లో సంజూ శాంస‌న్ సేన‌ 20 ప‌రుగుల…

March 24, 2024 / 07:39 PM IST
IPL 2024 RR vs LSG | పూర‌న్, రాహుల్ మెరుపులు స‌రిపోలే.. బోణీ కొట్టిన రాజ‌స్థాన్

IPL 2024 RR vs LSG : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో మ‌రో మ్యాచ్ ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కూ ఉత్కంఠ‌గా సాగింది.  హోరాహోరీగా జ‌రిగిన‌ పోరులో రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) అద్భుత విజ‌యం సాధించింది. ఆద్యంతం నువ్వానేనా అన్న‌ట్టు సాగిన మ్యాచ్‌లో సంజూ శాంస‌న్ సేన‌ 20 ప‌రుగుల తేడాతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌(LSG)పై గెలుపొందింది. కెప్టెన్ సంజూ శాంస‌న్(82 నాటౌట్), రియాన్ ప‌రాగ్‌(43)లు భారీ స్కోర్ అందించ‌గా.. అనంతరం ల‌క్నో బ్యాట‌ర్లు నికోల‌స్ పూరన్(64 నాటౌట్), కెప్టెన్ కేఎల్ రాహుల్(58) హ‌డ‌లెత్తించారు. సిక్స‌ర్ల‌తో స్టేడియాన్ని హోర్తించి ల‌క్ష్యాన్ని క‌రిగిస్తూ వ‌చ్చారు. కానీ, ఆఖ‌ర్లో రాజ‌స్థాన్ బౌల‌ర్లు పుంజుకొని క‌ట్ట‌డి చేశారు. దాంతో, రాజ‌స్థాన్ 17వ సీజ‌న్‌ను విజ‌యంతో ఆరంభించింది.

ఐపీఎల్‌లో గొప్ప రికార్డు ఉన్న పేస‌ర్ ట్రెంట్ బౌల్ట్ ఆదిలోనే నిప్పులు చెరిగాడు. బుల్లెట్ లాంటి బంతుల‌తో ల‌క్నో టాపార్డ‌ర్‌ను కూల్చాడు. డేంజ‌ర‌స్ ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్(4), డేవ్‌ద‌త్ ప‌డిక్కల్‌(0)ను ఔట్ చేసి ల‌క్నోను పీక‌ల్లోతు క‌ష్టాల్లోకి నెట్టాడు. నంద్రె బ‌ర్గ‌ర్ ఓవ‌ర్‌లో ఆయుష్ బ‌దౌనీ(1) సులువైన క్యాచ్ ఇచ్చి వెనుద‌రిగాడు.

ᴛʜᴇ ʟᴇꜰᴛ ᴀʀᴍ ʀᴀᴍᴘᴀɴᴛ 🎯

Trent Boult & Nandre Burger get 3️⃣ wickets in the power play for @rajasthanroyals 🙌@klrahul & @HoodaOnFire with the rebuilding 💪

Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱

Follow the match ▶️https://t.co/MBxM7IvOM8… pic.twitter.com/YKi85fVcrM

— IndianPremierLeague (@IPL) March 24, 2024

దాంతో, 194 ప‌రుగుల ఛేద‌న‌లో ల‌క్నో 11 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ దీప‌క్ హుడా(26) కాసేపు ధ‌నాధ‌న్ ఆడినా చాహ‌ల్ అత‌డిని వెన‌క్కి పంపాడు. ఆ త‌ర్వాత‌ రాహుల్‌కు జ‌త‌క‌లిసిన‌ పూరన్ ల‌క్నో బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డారు. వీళ్లిద్ద‌రూ ఎడాపెడా బౌండ‌రీలు బాదుతూ ఐదో వికెట్‌కు శ‌ర‌వేగంగా 85 ర‌న్స్ జోడించారు.

On The Charge ⚡️

Captain @klrahul brings up his 5️⃣0️⃣ in the chase 💪

Will #LSG get over the line tonight? 🤔

Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱

Follow the match ▶️https://t.co/MBxM7IvOM8 #TATAIPL | #RRvLSG | @LucknowIPL pic.twitter.com/RgQMDfls9Y

— IndianPremierLeague (@IPL) March 24, 2024

అయితే.. ప్ర‌మాద‌క‌ర‌మైన‌ ఈ జోడీని 16.1 ఓవ‌ర్‌లో సందీప్ శ‌ర్మ‌ విడ‌దీశాడు. అక్క‌డితో మ్యాచ్ రాజ‌స్థాన్ వైపు తిరిగింది. అవేశ్ ఖాన్ వేసిన 20 ఓవ‌ర్‌లో ల‌క్నోకు 27 ర‌న్స్ అవ‌స‌ర‌మ‌య్యాయి. కానీ, అవేశ్  క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేవ‌లం 6 ప‌రుగులే ఇచ్చాడు.

ర‌ఫ్ఫాడించిన‌ రియాన్

తొలుత ఆడిన‌ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 4 వికెట్ల న‌ష్టానికి 194 ప‌రుగుల‌ భారీ స్కోర్ కొట్టింది. కెప్టెన్ సంజూ శాంస‌న్(82 నాటౌట్: 51 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) హాఫ్‌ సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. ఈ ఏడాది రంజీల్లో ర‌ఫ్ఫాడించిన‌ రియాన్ ప‌రాగ్(43) సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. దాంతో, రాజ‌స్థాన్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 193 స్కోర్ చేయ‌గ‌లిగింది.

Much needed 4️⃣ and 6️⃣ for #RR

Who will lead the chase for #LSG?

Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱

Follow the match ▶️ https://t.co/xjNjyPa8V4 #TATAIPL | #RRvLSG pic.twitter.com/wj8UPgVP8K

— IndianPremierLeague (@IPL) March 24, 2024

ఓపెన‌ర్లు య‌శ‌స్వీ జైస్వాల్(24), జోస్ బ‌ట్ల‌ర్‌(11)లు విఫ‌లం కాగా. చివ‌ర్లో ధ్రువ్ జురెల్(20 నాటౌట్) అండ‌తో శాంస‌న్ రాజ‌స్థాన్‌కు భారీ స్కోర్ అందించాడు. ల‌క్నో బౌల‌ర్ల‌లో న‌వీన్ ఉల్ హ‌క్ రెండు, మొహ్సిన్ ఖాన్ ఒక వికెట్ తీశారు.

ఇవి కూడా చ‌ద‌వండి

 



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.