IPL 2024 SRH vs PBKS : ముల్లన్‌పూర్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SunRisers Hyderabad) భారీ స్కోర్ కొట్టింది. టాపార్డర్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టిన చోట తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి(64) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ…

IPL 2024 SRH vs PBKS : ముల్లన్‌పూర్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SunRisers Hyderabad) భారీ స్కోర్ కొట్టింది. టాపార్డర్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టిన చోట తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి(64) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ బాదిన అతడు అబ్దుల్ సమద్(25)తో విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో షహ్‌బాజ్ అహ్మద్(14) చితక్కొట్టడంతో ఆరెంజ్ ఆర్మీ 9 వికెట్ల నష్టానికి 182 రన్స్ బాదింది. ఖతర్నాక్ క్లాసెన్ సైతం ఔటైన వేళ.. భారీ స్కోర్‌పై ఆశలు సన్నగిల్లిన సమయంలో నితీశ్ తన మాస్టర్ క్లాస్ బ్యాటింగ్‌తో అలరించాడు. పంబాబ్ బౌలర్లో అర్స్‌దీప్ సింగ్(29/4) నాలుగు వికెట్లు పడగొట్టాడు.
టాస్ ఓడిన హైదరాబాద్‌కు ఆది నుంచే షాక్‌లు తలిగాయి. రబడ వేసిన తొలి ఓవర్ మొదటి బంతికే ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న ఓపెనర్ ట్రావిస్ హెడ్ 21 పరుగుల వద్ద ధావన్‌కు దొరికాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన నాలుగో ఓవర్లో హెడ్ వెనుదిరిగాక వచ్చిన ఎడెన్ మర్క్‌రమ్ డకౌటయ్యాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ(16) ధాటిగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకున్నాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రాహుల్ త్రిపాఠి(11)ని హర్షల్ పటేల్ వెనక్కి పంపాడు. 64 పరుగులకే టాప్ గన్స్ పెవిలియన్ చేరినా విధ్వంసక ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్(9) ఉన్నాడనే భరోసా.
A special counter attacking innings from Nitish Kumar Reddy
He is leading #SRH‘s fightback with some glorious shots
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia
#TATAIPL | #PBKSvSRH | @SunRisers pic.twitter.com/6SFysFcqKz
— IndianPremierLeague (@IPL) April 9, 2024
64 పరుగులకే 4 వికెట్లు
కానీ, హర్షల్ పటేల్ ఓవర్లో క్లాసెన్ భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద సామ్ కరన్ చేతికి చిక్కాడు. దాంతో, ఐదో వికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఓవైపు వికెట్లు పడుతున్నా యువకెరటం నితీశ్ రెడ్డి(64 : 37 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లు) చెలరేగాడు. 64 పరుగులకే 4 వికెట్లు పడిన జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యత తీసుకున్నాడు. హర్‌ప్రీత్ బ్రార్, సామ్ కరన్‌లను టార్గెట్ చేసిన నితీశ్ సిక్సర్లతో హోరెత్తించాడు. అబ్దుల్ సమద్(25) వచ్చాక మరింత రెచ్చిపోయిన నితీశ్ హాఫ్ ఐపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ బాదాడు. బ్యాటింగ్‌లో విదేశీ క్రికెటర్లపైనే ఎక్కువ ఆధారపడుతున్న హైదరాబాద్‌కు అభిషేక్ తర్వాత నేనున్నాంటూ నితీశ్ పెద్ద అభయమిచ్చాడు.
set batters
in the pavilion
Arshdeep Singh with another 𝙙𝙤𝙪𝙗𝙡𝙚 𝙙𝙚𝙡𝙞𝙜𝙝𝙩 over of the night
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia
#TATAIPL | #PBKSvSRH | @PunjabKingsIPL | @arshdeepsinghh pic.twitter.com/bXrqRn6NTV
— IndianPremierLeague (@IPL) April 9, 2024