IPL 2024 SRH vs PBKS : తెలుగు కొత్త సంవత్సరాది ఉగాది రోజున సన్‌రైజర్స్ హైదరాబాద్(sun risers hyderabad) విజయ ఢంకా మోగించింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings)ను ఓడించింది.

IPL 2024 SRH vs PBKS : తెలుగు కొత్త సంవత్సరాది ఉగాది రోజున సన్‌రైజర్స్ హైదరాబాద్(sun risers hyderabad) విజయ ఢంకా మోగించింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings)ను ఓడించింది.. ఐపీఎల్ 17వ సీజన్‌లో వరుసగా రెండో విక్టరీ కొట్టింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(64) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టగా.. భువనేశ్వర్, నట్టూలు మిడిలార్డర్ పని పట్టారు.
పంజాబ్ ఓటమి ఖాయమనుకున్న దశలో గత మ్యాచ్ హీరోలు శశాంక్ సింగ్(46 నాటౌట్), అశుతోష్ శర్మ(33 నాటౌట్)లు ధనాధన్ ఆడారు. మ్యాచ్‌ను ఆఖరి ఓవర్ వరకూ తీసుకెళ్లారు. అయితే.. ఉనాద్కాట్ ఆఖరి రెండు బంతులకు ఏడు రన్స్ ఇవ్వడంతో హైదరాబాద్ జట్టు 2 పరుగుల తేడాతో గెలుపొందింది.
Just in case you thought he was done 😉🔥
NKR produces his maiden IPL wicket 🧡#PlayWithFire #PBKSvSRH pic.twitter.com/BYk7S74VLh
— SunRisers Hyderabad (@SunRisers) April 9, 2024
స్వల్ప వ్యవధిలోనే..
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్‌తో రికార్డు సృష్టించిన హైదరాబాద్ మంగళవారం పంజాబ్ కింగ్స్‌కు తమ పవర్ చూపించింది. భారీ ఛేదనలో హైదరాబాద్ బౌలర్లు నిప్పులు చెరుగుతుండడంతో స్వల్ప వ్యవధిలోనే ధావన్ సేన మూడు వికెట్లు కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(4)ను భువీ వెనక్కి పంపగా.. భువనేశ్వర్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్(14) స్టంపౌట్ అయ్యాడు దాంతో, 20 పరుగులకే పంజాబ్ మూడు వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఓవర్లలో సికిందర్ రజా(28), సామ్ కరన్(29) నాలుగో వికెట్‌కు 38 రన్స్ జోడించి పంజాబ్ శిబిరంలో ఆశలు రేపారు.
Keeps his eyes on the ball ✅
Times his jump to perfection ✅
Takes a stunning catch ✅That was some grab from @SunRisers captain @patcummins30 👏 👏
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #PBKSvSRH pic.twitter.com/8rxKfvTs8t
— IndianPremierLeague (@IPL) April 9, 2024
అయితే.. నటరాజన్ ఈ జోడీని విడదీసి హైదరాబాద్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత జితేశ్ శర్మ(19) జట్టు స్కోర్ 114 పరగుల వద్ద ఔటయ్యాడు. ఆదశలో శశాంక్ సింగ్(46 నాటౌట్), అశుతోష్ శర్మ(33 నాటౌట్) కడదాకా పోరాడారు. ఆఖరి ఓవర్లో 29 రన్స అవసరమయ్యాయి. ఉనాద్కాట్ మూడు వైడ్స్ వేయగా.. అశుతోష్ రెండు సిక్స్‌లు బాదాడు. అయితే.. చివరి బంతికి శశాంక్ సిక్సర్ బాదినా హైదరాబాద్ 2 రన్స్ తేడాతో గెలిచింది.
⚡-quick with 𝐊𝐥𝐚𝐚𝐬 that was 🙇 https://t.co/fqpLSSl2RV
— SunRisers Hyderabad (@SunRisers) April 9, 2024
ముల్లన్‌పూర్ స్టేడియంలో అర్ష్‌దీప్ సింగ్ ధాటికి హైదరాబాద్ టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (21), అభిషేక్ శర్మ(16)లతో పాటు ఎడెన్ మర్క్‌రమ్(0) విఫలమయ్యారు. స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టిన చోట తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి(64) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి(11), హెన్రిచ్ క్లాసెన్(9)లు ఎక్కువ సేపు నిలవకపోయినా.. నితీశ్ ఒంటరి సైనికుడిలా పోరాడాడు.
నితీశ్ కుమార్ రెడ్డి(64)

ఐపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ బాదిన అతడు అబ్దుల్ సమద్(25)తో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో షహ్‌బాజ్ అహ్మద్(14 నాటౌట్) చితక్కొట్టడంతో ఆరెంజ్ ఆర్మీ 9 వికెట్ల నష్టానికి 182 రన్స్ బాదింది. ఖతర్నాక్ క్లాసెన్ సైతం ఔటైన వేళ.. భారీ స్కోర్‌పై ఆశలు సన్నగిల్లిన సమయంలో నితీశ్ తన మాస్టర్ క్లాస్ బ్యాటింగ్‌తో అలరించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.