Jasprit Bumarh : భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumarh) యార్కర్ వేశాడంటే ఎంతటి బ్యాటర్ అయినా ఔటవ్వాల్సిందే. యార్కర్ల కింగ్‌గా పేరొందిన బుమ్రా వైజాగ్ టెస్టు(Vizag Test)లోనూ తన పేస్ పవర్ చూపించాడు. తొలి టెస్టు హీరో ఓలీ పోప్…
Jasprit Bumarh : భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumarh) యార్కర్ వేశాడంటే ఎంతటి బ్యాటర్ అయినా ఔటవ్వాల్సిందే. యార్కర్ల కింగ్‌గా పేరొందిన బుమ్రా వైజాగ్ టెస్టు(Vizag Test)లోనూ తన పేస్ పవర్ చూపించాడు. తొలి టెస్టు హీరో ఓలీ పోప్(Ollie Pope)ను యార్కర్‌తో బౌల్డ్ చేశాడు. ఆ బంతిని అడ్డుకునేందుకు పోప్ విశ్వప్రయత్నం చేశాడు. కానీ, అది బుల్లెట్ వేగంతో వికెట్లను తాకింది. వికెట్ కాపాడుకునేందుకు బ్యాట్ అడ్డుపెట్టిన పోప్ బ్యాలెన్స్ కోల్పోయి దాదాపు కిందపడిపోయాడు.
అంతే.. భారత ఆటగాళ్లు సంబురాల్లో మునిగిపోగా.. అతడు నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. అంతకు ముందే జో రూట్(5)ను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టిన ఈ స్పీడ్‌గన్.. పోప్‌ను వెనక్కి పంపి బెన్ స్టోక్స్ సేనను ఒత్తిడిలోకి నెట్టాడు.
Timber Striker Alert 🚨
A Jasprit Bumrah special 🎯 🔥
Drop an emoji in the comments below 🔽 to describe that dismissal
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @Jaspritbumrah93 | @IDFCFIRSTBank pic.twitter.com/U9mpYkYp6v
— BCCI (@BCCI) February 3, 2024
8 ఓవర్లు వేసిన బుమ్రా మూడు మెయిడెన్స్ వేయడమే కాకుండా రెండు కీలక వికెట్లు తీసి 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఉప్పల్ టెస్టులోనూ డబుల్ సెంచరీకి చేరువైన పోప్‌ను 196 పరుగుల వద్ద బుమ్రా బౌల్డ్ చేసిన విషయం తెలిసిందే.
ఓలీ పోప్(23)

భారత్‌ను 396 పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లండ్ దూకుడుగా తొలి ఇన్నింగ్స్ ఆరంభించింద. ఓపెనర్లు బెన్ డకెట్(21), జాక్ క్రాలే(76) బజ్‌బాల్ ఆటతో విరుచుకుపడ్డారు. లంచ్ తర్వాత ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీసినా.. క్రాలే మాత్రం రెచ్చిపోయాడు. బుమ్రా, అశ్విన్, కుల్దీప్లను ఉతికారేస్తూ 52 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. అతడి దూకుడు చూస్తుంటే ఇంగ్లండ్ భారీ స్కోర్ చేయడం పక్కా అనుకున్నారంతా.
జాక్ క్రాలే(76)

కానీ, అక్షర్ పటేల్ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ సూపర్ క్యాచ్‌తో క్రాలే ఇన్నింగ్స్‌కు తెరదించాడు. ఆ తర్వాత బుమ్రా డేంజరస్ రూట్, పోప్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. టీ సమయానికి 4 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్(5 నాటౌట్), జానీ బెయిర్‌స్టో(24 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 241 పరుగులు వెనకబడి ఉంది.
