Kaatera Movie | కన్నడ అగ్ర నటుడు దర్శన్ (Darshan) ప్రధాన పాత్రలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘కాటేరా’ (Kaatera). యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాకు తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించగా.. మాలాశ్రీ కుమార్తె ఆరాధన రామ్ కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది.
Kaatera Movie | కన్నడ అగ్ర నటుడు దర్శన్ (Darshan) ప్రధాన పాత్రలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘కాటేరా’ (Kaatera). యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాకు తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించగా.. మాలాశ్రీ కుమార్తె ఆరాధన రామ్ కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా గతేడాది డిసెంబర్ 29న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. అయితే థియేటర్‌లో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇన్ని రోజులు ఈ సినిమా కన్నడ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండగా.. తాజాగా తెలుగు, తమిళ వెర్షన్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ జీ5 సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టింది. 1970లో కర్ణాటకలోని ఓ గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనలను ఆధారంగా ఈ సినిమా వచ్చింది.
2023 HGOTY at Karnataka Box office – Mega Hit #Kaatera now streaming in Telugu on #ZEE5 #KaateraOnZEE5 @dasadarshan #DBoss #DevilTheHero #Kaatera pic.twitter.com/smzPJLlnDx
— 𝐃 𝐁𝐎𝐒𝐒 ✯✮✬ (@_dboss_fan) April 14, 2024