Kharge-Kejriwal meet | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్క్ స్టైల్‌లో కనిపించారు. (Kharge-Kejriwal meet) తల చుట్టూ మఫ్లర్‌ను ఖర్గే చుట్టుకున్నారు. అయితే కేజ్రీవాల్ మాత్రం సాధారణంగా కనిపించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్క్ స్టైల్‌లో కనిపించారు. (Kharge-Kejriwal meet) తల చుట్టూ మఫ్లర్‌ను ఖర్గే చుట్టుకున్నారు. అయితే కేజ్రీవాల్ మాత్రం సాధారణంగా కనిపించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ బ్లాక్ ఆధ్వర్యంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ, సీట్ల కేటాయింపుపై ఇరువురూ చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌లో సీట్ల పంపిణీపై పురోగతి కనిపించినట్లు సమాచారం.
Arvind Kejriwal
మరోవైపు ఖర్గే, కేజ్రీవాల్ భేటీకి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అరవింద్ కేజ్రీవాల్ ట్రేడ్ మార్క్ స్టైల్ అయిన తలచుట్టూ మఫ్లర్‌తో ఖర్గే కనిపించడం నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంది. ఢిల్లీలో విపరీతమైన చలిని తట్టుకునేందుకు ఖర్గే ఇలా ప్రయత్నించారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ మాత్రం సాధారణంగానే కనిపించారు. తల చుట్టూ మఫ్లర్ చుట్టుకునే తన స్టైల్‌ను చాలా కాలం కిందటే ఆయన వీడారు.
Muffler Shifted 😄 pic.twitter.com/4XdOuqP5u3
— Aashish singh 🇮🇳 (@Aashishsingh_2) January 14, 2024
