KKR vs RR : ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. చాహల్ బౌలింగ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(11) ఎల్బీగా ఔటయ్యాడు. ప్రస్తుతం ఆండ్రూ రస్సెల్(4), ఓపెనర్ సునీల్ నరైన్(74)లు ఆడుతున్నారు.
KKR vs RR : ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. చాహల్ బౌలింగ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(11) ఎల్బీగా ఔటయ్యాడు. ప్రస్తుతం ఆండ్రూ రస్సెల్(4), ఓపెనర్ సునీల్ నరైన్(74)లు ఆడుతున్నారు. దాంతో 14 ఓవర్లకు కోల్‌కతా 146 పరుగులు చేసింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా నరైన్ బౌండరీతో చెలరేగి హాఫ్ సెంచరీ సాధించాడు.
5️⃣0️⃣ up for Sunil Narine 💪
5️⃣0️⃣ partnership up for the 2nd wicket 💪
1️⃣0️⃣0️⃣ up for @KKRidersHome side looking good at the halfway stage 👌👌
Follow the Match ▶️https://t.co/13s3GZLlAZ #TATAIPL | #KKRvRR pic.twitter.com/GWvUOBOLDX
— IndianPremierLeague (@IPL) April 16, 2024
టాస్ ఓడిన కోల్‌కతాకు ఆదిలోనే షాక్. గత మ్యాచ్ హీరో ఫిలిప్ సాల్ట్(10)ను అవేశ్ ఖాన్ వెనక్కి పంపాడు. సాల్ట్ కొట్టిన బంతిని గమనించిన అవేశ్ ఎడమ వైపు డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 21 పరుగుల వద్ద కోల్‌కతా మొదటి వికెట్ పడింది. యువకెరటం అంగ్‌క్రిష్ రఘువంశీ(30) ఉన్నంత సేపు ధనాధన్ ఆడాడు. అయితే.. కుల్దీప్ సేన్ ఓవర్లో అశ్విన్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన అయ్యర్(11) మళ్లీ మునపటిలానే వికెట్ పారేసుకున్నాడు.