KKR vs RR : కొండంత ఛేదనలో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) కష్టాల్లో పడింది. పవర్ ప్లేలోనే ఆ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. హర్షిత్ రానా బౌలింగ్‌లో కెప్టెన్ సంజూ శాంసన్(12) భారీ షాట్ ఆడి నరన్ చేతికి చిక్కాడు.

KKR vs RR : కొండంత ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ కష్టాల్లో పడింది. పవర్ ప్లేలోనే ఆ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. హర్షిత్ రానా బౌలింగ్‌లో కెప్టెన్ సంజూ శాంసన్(12) భారీ షాట్ ఆడి నరైన్ చేతికి చిక్కాడు. శాంసన్ వికెట్ పడడంతో వచ్చిన రియాన్ పరాగ్ (20) మరో ఓపెనర్ జోస్ బట్లర్(20)లు దంచుతున్నారు. ఆరు ఓవర్లకు రాజస్థాన్ స్కోర్.. 72/2.
అంతకుముందు ఓపెనర్ యశస్వీ జైస్వాల్(19) మంచి టచ్‌లో కనిపించినా.. వైభవ్ అరోరా బౌలింగ్‌లో స్లిప్‌లో అయ్యర్‌కు దొరికాడు. దాంతో, 22 పరుగుల వద్ద రాజస్థాన్ తొలి వికెట్ పడింది. ఇక 2 పరుగుల వద్ద వరుణ్ చక్రవర్తి క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన శాంసన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.