Loksabha Elections 2024 : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, గుజరాత్ కాంగ్రెస్ మాజీ చీఫ్ అర్జున్ మోధ్‌వాడియా మంగళవారం కాషాయ పార్టీలో చేరారు.
Loksabha Elections 2024 : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, గుజరాత్ కాంగ్రెస్ మాజీ చీఫ్ అర్జున్ మోధ్‌వాడియా మంగళవారం కాషాయ పార్టీలో చేరారు. అర్జున్ మోధ్‌వాదియా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సమక్షంలో మోధ్‌వాడియాతో పాటు మాజీ ఎమ్మెల్యేలు అంబరీష్ దెర్, ములుభాయ్ కందోరియా బీజేపీలో చేరారు.
40 ఏండ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మోథ్‌వాడియా సోమవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవి నుంచి వైదొలుగుతూ అసెంబ్లీ స్పీకర్‌కు రాజీనామా పత్రం అందచేశారు. ప్రజలకు సేవ చేసే అవకాశం లేకపోవడంతో తాను పార్టీ నుంచి బయటపడుతున్నానని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖలో మోథ్‌వాదియా పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవుల నుంచి వైదొలగుతున్నానని లేఖలో ఆయన స్పష్టం చేశారు. జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ వేడుకకు ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడంతో తాను తీవ్ర నిరాశకు లోనయ్యానని, ఈ విషయంలో తన వాణిని గట్టిగా వినిపించానని మోధ్‌వాదియా పేర్కొన్నారు.
Read More :
Health Tips | ఆ గోళీలు మితిమీరినా ప్రమాదమే
