Loksabha polls | ఒక కుటుంబంలో సాధారణంగా నలుగురైదుగురు ఓటర్లు ఉంటారు. మహా అయితే కొన్ని కుటుంబాల్లో ఓ 10, 12 మంది ఓటర్లు కూడా ఉంటుండవచ్చు. అత్యంత అరుదుగా కొన్ని కుటుంబాల్లో 40 నుంచి 50 మంది ఓటర్లు కూడా ఉంటారు. కానీ అసోంలోని ఓ కుటుంబంలో మాత్రం ఏకంగా 350 మంది ఓటర్లు ఉన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో వాళ్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.
Loksabha polls : ఒక కుటుంబంలో సాధారణంగా నలుగురైదుగురు ఓటర్లు ఉంటారు. మహా అయితే కొన్ని కుటుంబాల్లో ఓ 10, 12 మంది ఓటర్లు కూడా ఉంటుండవచ్చు. అత్యంత అరుదుగా కొన్ని కుటుంబాల్లో 40 నుంచి 50 మంది ఓటర్లు కూడా ఉంటారు. కానీ అసోంలోని ఓ కుటుంబంలో మాత్రం ఏకంగా 350 మంది ఓటర్లు ఉన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో వాళ్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.
అసోం రాష్ట్రం సోనిట్‌పూర్ జిల్లాలోని ఫులోగురి నేపాలీ పామ్ గ్రామంలో దివంగత రోన్ బహదూర్ తాపాకు ఐదుగురు భార్యలు. ఐదుగురు భార్యల ద్వారా ఆయన 12 మంది కొడుకులను, 9 మంది బిడ్డలను కన్నాడు. 12 మంది కొడుకుల పిల్లలు 56 మంది కాగా, 9 మంది బిడ్డలకు కూడా దాదాపు 50 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ల పిల్లలు, వాళ్ల పిల్లల పిల్లలు కలిపి మొత్తం రోన్ తాపా కుటుంబసభ్యుల సంఖ్య 1200 దాటింది. వారిలో 350 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు.
ఏప్రిల్ 19న లోక్‌సభ తొలి విడత ఎన్నికల పోలింగ్‌లో వాళ్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 350 మంది ఓటర్లతో అత్యధిక మంది ఓటర్లున్న అతికొద్ది కుటుంబాల్లో ఒకటిగా తాపా కుటుంబం నిలిచింది. అసోంలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలకు మూడు విడతల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7న పోలింగ్ జరగనున్నది.