
LSG vs DC: లక్నో నిర్దేశించిన 168 పరుగుల ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు డగౌట్‌కు చేరారు. పృథ్వీ షా(32), డేవిడ్ వార్నర్(8)లు ఔటయ్యారు. ప్రస్తుతం రిషభ్ పంత్(20), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(24)లు ఆడుతున్నారు. స్పిన్నర్లు రంగంలోకి దిగడంతో స్కోర్ వేగం తగ్గినా.. రవి బిష్ణోయ్ వేసిన 11వ ఓవర్‌లో పంత్ రెచ్చిపోయాడు. వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. దాంతో, 11 ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 90/2. పంత్ సేన విజయానికి 54 బంతుల్లో 78 రన్స్ కావాలి.
భారీ ఛేదనలో 20 పరుగుల వద్దే ఢిల్లీ తొలి వికెట్ పడింది. డేంజరస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(8) ఔటయ్యాడు. యశ్ ఠాకూర్ ఓవర్లో లెగ్ సైడ్ షాట్ ఆడబోయాడు. కానీ, ప్యాడ్‌కు తగిలిన బంతి ఒక్క బౌన్స్‌తో వికెట్లను తాకింది. దాంతో, 24 పరగులు వద్ద ఢిల్లీ మొదటి వికెట్ పడింది. ఆ తర్వాత పృథ్వీ షా(32), ఫ్రేజర్ మెక్‌గుర్క్‌లు బౌండరీలతో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. అయితే.. రవి బిష్ణోయ్ ఊరించే బంతితో షాను బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ పంత్ ఆచితూచి ఆడుతున్నాడు.