LSG vs DC : హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న లక్నో సూపర్ జెయింట్స్(Luckonw Super Giants) సొంత మైదానంలో తడబడింది. కానీ, యువకెరటం ఆయుష్ బదొని(55 నాటౌట్) ఢిల్లీ బౌలర్లకు సవాల్ విసిరాడు.

LSG vs DC : హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న లక్నో సూపర్ జెయింట్స్(Luckonw Super Giants) సొంత మైదానంలో తడబడింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(20/3), ఖలీల్ అహ్మద్(41/2)ల విజృంభణతో 100లోపే ఆలౌట్ ప్రమాదంలో పడింది. కానీ, యువకెరటం ఆయుష్ బదొని(55 నాటౌట్) ఢిల్లీ బౌలర్లకు సవాల్ విసిరాడు.
టాపార్డర్ విఫలమైన చోట హాఫ్ సెంచరీ బాదాడు. టెయిలెండర్ అర్షద్ ఖాన్(20 నాటౌట్)తో కలిసి 73 పరుగులు జోడించాడు. దాంతో, లక్నో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 రన్స్ కొట్టింది. ఆదిలో మ్యాచ్‌పై పట్టుబిగించిన ఢిల్లీ.. మరోసారి ప్రత్యర్థికి భారీ స్కోర్ చేసే చాన్స్ ఇచ్చింది.
A crucial 5️⃣0️⃣-run partnership 🙌
Ayush Badoni & Arshad Khan have powered #LSG to a competitive total!
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #LSGvDC pic.twitter.com/coyAwzQ85N
— IndianPremierLeague (@IPL) April 12, 2024
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. డేంజరస్ ఓపెనర్ క్వింటన్ డికాక్(19)ను ఖలీల్ అహ్మద్ ఎల్బీగా వెనక్కి పంపాడు. 28 పరుగులు వద్ద లక్నో తొలి వికెట్ పడిన లక్నోను ఖలీల్ మళ్లీ దెబ్బకొట్టాడు. క్రీజులో కుదురుకుంటున్న దేవ్‌దత్ పడిక్కల్(13)ను ఎల్బీగా దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత రాహుల్, స్టోయినిస్‌తో ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసినా.. కుల్దీప్ ఎంట్రీతో లక్నో వికెట్ల పతనం మొదలైంది.
𝗪𝗔𝗧𝗖𝗛 𝗢𝗡 𝗟𝗢𝗢𝗣! 🔄 😍
Kuldeep Yadav straight away unveiling his magic!👌👌
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #LSGvDC | @imkuldeep18 pic.twitter.com/pzfIQYpqnA
— IndianPremierLeague (@IPL) April 12, 2024
చైనామన్ కుల్దీప్ వరుస బంతుల్లో మార్కస్ స్టోయినిస్(8), నికోలస్ పూరన్(0)లను ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో కేఎల్ రాహుల్(39)ను పెవిలియన్ పంపి లక్నోను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. దాంతో, లక్నో జట్టు 77 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఇషాంత్ శర్మ ఓవర్లో దీపక్ హుడా(10) వెనుదిరిగాడు. అక్కడితో 12 పరుగుల వ్యవధిలో రాహుల్ సేన ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం , కృనాల్ పాండ్యా(1)లు ఆడుతున్నారు. 12 ఓవర్లకు స్కోర్.. 90/6. 94 పరుగులకే ఏడు వికెట్లు పడిన జట్టును అయుష్ బదొని ఆదుకున్నాడు. టెయిలెండర్లతో కలిసి లక్నోకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.