LSG vs DC : ఐపీఎల్ పదిహేడో సీజన్‌లో మరో ఆసక్తికర సమరం కాసేపట్లో షురూ కానుంది. లక్నో సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేఎల్ రాహుల్(KL Rahul) బ్యాటింగ్ తీసుకున్నాడు.

LSG vs DC : ఐపీఎల్ పదిహేడో సీజన్‌లో మరో ఆసక్తికర సమరం కాసేపట్లో షురూ కానుంది. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants).. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో తలపడుతోంది. లక్నో సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేఎల్ రాహుల్(KL Rahul) బ్యాటింగ్ తీసుకున్నాడు.
లక్నో తుది జట్టు : కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, దేవ్‌దత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదొని, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్ ఉల్ హక్.
ఢిల్లీ తుది జట్టు : పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, షాయ్ హోప్, రిషభ్ పంత్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్,జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, అన్రిచ్ నోర్జియా, ఇషాంత్ శర్మ. ఖలీల్ అహ్మద్.
లక్నో జట్టులో మయాంక్ యాదవ్ స్థానంలో అర్షద్ ఖాన్ ఆడనుండగా… కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్‌లు ఢిల్లీ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. టాప్ 4 బెర్తులు ఖరారవుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కానుంది. ప్రస్తుతం పట్టికలో మూడో స్థానంలో ఉన్న లక్నో ఈ మ్యాచ్‌లో గెలిస్తే టాప్‌లోకి దూసుకెళ్తుంది. మరోవైపు హ్యాట్రిక్ ఓటమి తప్పించుకునేందుకు ఢిల్లీ శతవిధాలా ప్రయత్నించనుంది.