Maha shivaratri 2024 | నిండుమనసుతో అభిషేకం చేస్తే పరమేశ్వరుడు ప్రసన్నవుతాడు. త్రికరణ శుద్ధితో రెండు చెంబుల నీళ్లు పోసి ‘ఓం నమః శివాయ’ అంటే అనుగ్రహిస్తాడు. మన కోరికలను అనుసరించి విశేషంగా అర్చిస్తే అవి వెంటనే సిద్ధిస్తాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.
Maha shivaratri 2024 | నిండుమనసుతో అభిషేకం చేస్తే పరమేశ్వరుడు ప్రసన్నవుతాడు. త్రికరణ శుద్ధితో రెండు చెంబుల నీళ్లు పోసి ‘ఓం నమః శివాయ’ అంటే అనుగ్రహిస్తాడు. మన కోరికలను అనుసరించి విశేషంగా అర్చిస్తే అవి వెంటనే సిద్ధిస్తాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కోరికను బట్టి పలురకాల పుష్పాలతో పరమేశ్వరుడిని అర్చించే సంప్రదాయం ఉన్నది. అయితే, సద్గురువును ఆశ్రయించి, విధివిధానాలు అనుసరించి ఈ పూజలు చేయాలి.
గన్నేరు- ధనలాభం
ఉమ్మెత్త- మోక్షప్రాప్తి
నల్లకలువలు- సుఖశాంతులు
నాగకేసరాలు- రాజ్యప్రాప్తి
తెల్లజిల్లేడు- మంత్రసిద్ధి
సన్నజాజులు- అనుకూల వివాహం
దర్భపూలు- ఆరోగ్యం
మొల్లపూలు- సంతానప్రాప్తి
బిల్వదళాలు- దారిద్య్ర నాశనం
మరువక పత్రాలు- సుఖం
మోదుగ- ఆయుష్షు
