Manjummel Boys | కొంతకాలంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మలయాళ సినిమాలు తమదైన మార్క్‌ను క్రియేట్ చేస్తున్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సర్వైవర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన 12 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటి.. మాలీవుడ్‌లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన సినిమాల జాబితాలో నిలిచింది.
Manjummel Boys | కొంతకాలంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మలయాళ సినిమాలు తమదైన మార్క్‌ను క్రియేట్ చేస్తున్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా ఈ జాబితాలో ‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys) కూడా చేరిపోయింది. సర్వైవర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన 12 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటి.. మాలీవుడ్‌లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన సినిమాల జాబితాలో నిలిచింది.
కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ స్థాయిలో ఊహించని స్పందన రాబట్టుకుంటూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. దీంతో ఇప్పటివరకు మాలీవుడ్ నిర్మించిన వంద కోట్ల గ్రాస్ సినిమాల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఈ ఆరు సినిమాల్లో మూడు ఇటీవలే విడుదలైనవి కావడం విశేషం. ఈ జాబితాలో రీసెంట్గా విడుదలైన The Goat life ఉంది.
మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ వాస్తవ సంఘటనల ఆధారంగా బెన్యమిన్ రాసిన Aadujeevitham నవల స్ఫూర్తితో తెరకెక్కింది. ఈ చిత్రంలో మలయాళంలో The Goat Lifeగా రిలీజ్ కాగా.. తెలుగులో ఆడు జీవితం టైటిల్‌తో విడుదలైంది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీలో కేవలం 9 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ను చేరుకోవడం విశేషం.
ఇక నస్లెన్ కే గఫూర్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ప్రేమలు. ఈ మూవీ 31 రోజుల్లో వంద కోట్ల ఫీట్ చేరుకుంది.
ఇప్పటికే 2018Movie 11 రోజుల్లో ఈ క్లబ్లో ఉండగా.., లూసిఫర్ 12 రోజుల్లో పులి మురుగన్ 36 రోజుల్లో ఈ ఫీట్‌ను చేరుకున్నాయి.
MALAYALAM CINEMA has produced SIX ₹100 CR GROSSERS to date:#Aadujeevitham – 9 Days#2018Movie – 11 Days#Lucifer – 12 Days#ManjummelBoys – 12 Days#Premalu – 31 Days#Pulimurugan – 36 Days
THREE out of the SIX FILMS were released in the FIRST QUARTER of 2024. pic.twitter.com/McZaWuYohz
— Gulte (@GulteOfficial) April 6, 2024
