Married suicide | వరకట్న వేధింపుల(Dowry harassment)కు ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య(Married suicide) చేసుకున్న ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
హైదరాబాద్ : వరకట్న వేధింపుల(Dowry harassment)కు ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య(Married suicide) చేసుకున్న ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. మంగళవారం చేవెళ్ల ఎస్‌ఐ బ్రహ్మం తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా రాకంచెర్ల గ్రామానికి చెందిన లలిత కుమార్తె జ్యోతి (23)ని చేవెళ్ల మండల పరిధిలోని ఆలూర్ గ్రామానికి చంద్రయ్య కుమారుడు రాజు (30)కి ఇచ్చి 18 నెలల క్రితం వివాహనం చేశారని తెలిపారు.
వివాహనం అయినప్పటి నుంచి రాజు జ్యోతిని అదనంగా వరకట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేశానడని, వివాహ సమయంలోనే రాజుకు 6 తులాల బంగారం, ద్విచక్ర వాహనం, రూ.5 లక్షల నగదును ఇచ్చామని బాధితులు తెలిపారని చెప్పారు. పెళ్లయిన అనంతరం జ్యోతి రాజు వద్ద కేవలం 4 నెలలే ఉన్నదని మిగతా రోజులు తల్లి లలిత వద్దనే ఉందన్నారు.
గత మూడు రోజుల క్రితం రాజు తండ్రి చంద్రయ్య, ఇద్దరు పెద్దమనుషుల సమక్షంలో జ్యోతి ఉంటున్న తల్లిగారి ఇంటికి వెళ్లి నచ్చజెప్పి ఆలూర్ గ్రామానికి తీసుకువచ్చారు. ఈనెల 29వ తేదీన తన కూతురు జ్యోతి ఆలూర్ గ్రామంలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నదని తెలిపారు. మృతురాలు తల్లి లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
