Maruti Suzuki Swift | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) తన స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ (Swift Facelift) కారును వచ్చేనెల 9వ తేదీన ఆవిష్కరించనున్నది.
Maruti Suzuki Swift | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) తన స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ (Swift Facelift) కారును వచ్చేనెల 9వ తేదీన ఆవిష్కరించనున్నది. ఈ ఏడాదిలో మారుతి ఆవిష్కరిస్తున్న ప్రధాన మోడల్ కారు ఇది. న్యూ డిజైర్ కంపాక్ట్ సెడాన్ కారును ఈ ఏడాది చివర్లో ఆవిష్కరించనున్నది. యెడ్ (YED) కోడ్ నేమ్‌తో వస్తున్న నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ (Swift).. అడాస్ (ADAS) వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్స్ విత్ 6-ఎయిర్ బ్యాగ్స్ తో వస్తున్నది. ఇటీవల జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఆటో మోటార్ షోలో మారుతి పేరెంట్ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ తన ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కారును ప్రదర్శించింది.
ప్రస్తుత మోడల్ కారులో కే12 ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ స్థానే కొత్తగా వచ్చే జడ్ సిరీస్ స్విఫ్ట్ కారులో 1.2 లీటర్ల త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 90 బీహెచ్పీ విద్యుత్, 113 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. పూర్తి వివరాలు వెల్లడి కాకున్నా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లతో వస్తుందని తెలుస్తున్నది. సీఎన్జీ, హైబ్రీడ్ ఇంజిన్ ఆప్షన్లతోనూ లభిస్తుందని సమాచారం.
ఫ్రంట్‌లో షార్ప్ లుకింగ్ హెడ్ ల్యాంప్స్ విత్ ప్రొజెక్టర్ సెటప్, ఇన్ బిల్ట్ ఎల్ఈడీ డే టైం రన్నింగ్ ల్యాంప్స్, రెండు హెడ్ ల్యాంప్స్ మధ్య రీ డిజైన్డ్ హానీ కాంబ్ ప్యాటర్న్ బ్యాక్ గ్రిల్లె విత్ డార్క్ క్రోమ్ ఫినిష్ ఉంటది. 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, టెయిల్ గేట్ మీద హైబ్రీడ్ బ్యాడ్జ్ ఉంటుంది.ప్రస్తుత మోడల్ కారు కంటే న్యూ స్విఫ్ట్ 15ఎంఎం లాంగర్, 40 ఎంఎం వైడర్, 30 ఎంఎం టాలర్ గా వస్తుంది. హియర్ టెక్ ప్లాట్ ఫామ్ ఆధారంగా న్యూ జనరేషన్ స్విఫ్ట్ రూపుదిద్దుకున్నది. బాయ్ నెట్ కింద, గ్రిల్లెపైన కంపెనీ లోగో ఉంటది.
ఫోర్డ్ ఫిగో, మారుతి బాలెనో, మారుతి బ్రెజాల్లో మాదిరిగా బ్లాక్ అండ్ వైట్ డ్యుయల్ టోన్ థీంతోపాటు ఆల్ న్యూ డాష్ బోర్డ్ లేఔట్ ఉంటుంది. 9.0-అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తోపాటు న్యూ డాష్ బోర్డ్ లేఔట్, స్లీక్ ఏసీ వెంట్స్, బాటంలో హెచ్ వ్యాక్ కంట్రోల్స్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో న్యూ స్విఫ్ట్ ఇంటీరియర్ డిజైన్ చేశారు.
360-డిగ్రీ కెమెరాతోపాటు డ్యుయల్ సెన్సర్ బ్రేక్ సపోర్ట్, అడాప్టివ్ హై బీం అసిస్ట్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, కొల్లిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి అడాస్ ఫీచర్లు, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, 6-ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ప్రస్తుత మోడల్ స్విఫ్ట్ ధర రూ.5.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. కొత్త ఫీచర్లు, డిజైన్ తో వస్తున్న న్యూ స్విప్ట్ కారు ధర రూ.6.3 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి మొదలవుతుందని భావిస్తున్నారు. హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, టాటా టియాగో వంటి కార్లతో పోటీ పడుతుందని తెలుస్తున్నది.