
న్యూఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ఓటింగ్ నెమ్మదిగా ప్రారంభమైంది. సామాన్య ప్రజలతో పాటు నాయకులు కూడా ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివచ్చారు.
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అల్కా లాంబా రఘువీర్ నగర్లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలోని ప్రతి ఓటరు బయటకు వచ్చి ఓటు వేయాలని కోరారు. మార్పు కోసం ప్రజలు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు.
867891
