Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Medaram Jathara | గద్దెపై కొలువుదీరిన సమ్మక్క తల్లి.. ఆదివాసీ జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 23, 2024No Comments

మేడారం వనాలు గురువారం సమ్మక నామస్మరణతో మార్మోగాయి. అడవి అంతా భక్తజన సందోహంతో నిండిపోయింది. ఆదివాసీ జాతరలో అతి ముఖ్యమైన కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.

February 23, 2024 / 07:00 AM IST
Medaram Jathara | గద్దెపై కొలువుదీరిన సమ్మక్క తల్లి.. ఆదివాసీ జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం
  • చిలుకలగుట్ట నుంచి గద్దెల దాకా ఎదురేగిన భక్తజనం
  • దారి పొడవునా పసుపు, కుంకుమలతో ముగ్గులు
  • పోలీసుల తుపాకీ వందనంతో సమ్మకకు స్వాగతం
  • మేడారం గద్దెలపై ఆసీనులైన నలుగురు వన దేవతలు
  • ఎదురెల్లి స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రి, అధికార యంత్రాంగం
  • యాట బలులు, ఎదురుకోళ్లు, ఒడి బియ్యం మొకులు
  • ఆదివాసీల నృత్యాలు, శివసత్తుల పూనకాలు

Medaram Jathara | ములుగు, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ): మేడారం వనాలు గురువారం సమ్మక నామస్మరణతో మార్మోగాయి. అడవి అంతా భక్తజన సందోహంతో నిండిపోయింది. ఆదివాసీ జాతరలో అతి ముఖ్యమైన కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. లక్షలాది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల మొకులు, అధికారిక లాంఛనాలతో జిల్లా ఎస్పీ శబరీష్‌, పోలీసు ఉన్నతాధికారులు తుపాకీతో సమర్పించిన గౌరవ వందనం మధ్య రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సీతక్కతోపాటు జిల్లా కలెక్టర్‌ సమ్మక్కకు సాదర స్వాగతం పలికారు.

భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆదివాసీ వడ్డెలు (పూజారులు) వనదేవత సమ్మకను మేడారం గద్దెలపైకి తోడ్కొనివచ్చారు. సమ్మక చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెలపైకి చేరుకునే ఈ పతాక ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. ‘సమ్మక్కో.. సారక్కో.. నమో సమ్మక.. జై సమ్మక..’ అంటూ మొకు లు సమర్పించారు. సమ్మక ఉండే చిలుకలగుట్ట జనంతో కిటకిటలాడింది. అకడినుంచి మేడా రం వరకు కిలోమీటరున్నర దారి ఇరువైపులా భక్తజనంతో నిండిపోయింది. చిలుకలగుట్ట నుంచి మేడారానికి సమ్మకను తీసుకొచ్చే గిరిజన జాతర ప్రధాన ఘట్టం గురువారం సాయం త్రం 7:11 గంటల నుంచి రాత్రి 9:22 గంటల వరకు ఉద్విగ్న క్షణాల నడుమ కొనసాగింది.

Medaram2

ఎదురేగిన భక్తులు
వన దేవత సమ్మకను మేడారం గద్దెలపైకి తీసుకొచ్చే కార్యక్రమం గురువారం ఉదయమే మొదలైంది. వడ్డెలు ఉదయం మేడారం సమీపంలోని చిలుకలగుట్ట అడవిలోకి వెళ్లి వనం (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని సమ్మక పూజా మందిరం నుంచి అడేరాలు (కొత్త కుండలు)ను తెచ్చి గద్దెలపైకి చేర్చారు. అనంతరం కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మకను గద్దెపైకి తెచ్చేందుకు వడ్డెల బృందం సాయంత్రం 4 గంటలకు చిలుకలగుట్టపైకి బయల్దేరారు.

అప్పటికే చిలుకలగుట్ట ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది. దారి పొడవునా పసుపు, కుంకుమల ముగ్గులు వేసి సమ్మక రాక కోసం భక్తులంతా కన్నార్పకుండా చిలుకలగుట్టపైకి చూస్తుండి పోయారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న అడవి తల్లిని చేతపట్టుకున్న మరుక్షణమే సమ్మక ప్రధాన పూజారి కొకెర క్రిష్ణయ్య తన్మయత్వంతో ఒక ఉదుటున చిలుకలగుట్ట దిగారు. మిగిలిన వడ్డెలు క్రిష్ణయ్యను తోడొని వచ్చారు.

సమ్మక రాకకు సూచనగా ఆ దేవతను ఆహ్వానిస్తూ ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాల ప్రకారం ఎస్పీ పీ శబరీష్‌ ఏకే-47 తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం ములుగు జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సైతం ఏకే-47 తుపాకీ ట్రిగ్గర్‌ను నొకారు. సమ్మక రాకను సూచించే ఈ శబ్ధంతో ఒకసారిగా చిలుకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక నామస్మరణతో చిలుకలగుట్ట ప్రాంతం మార్మోగింది.

Medaram3

ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసు బలగాల నడుమ వడ్డెల బృందం సమ్మక రూపంతో మేడారం వైపు బయల్దేరారు. వంద మీటర్లు దాటగానే ఒకసారి, చిలుకలగుట్ట దాటే సమయంలో మరోసారి ములుగు ఎస్పీ తుపాకీ కాల్పులు జరిపి సమ్మకను ఆహ్వానించారు. అకడినుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆదివాసీ పూజారుల బృందం సమ్మకను మేడారం గద్దెలపైకి తరలించడం మొదలుపెట్టారు.

సమ్మకకు ఎదురుగా కోళ్లను, గొర్రెలను బలి ఇచ్చి మొకులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలతో శివాలూగారు. మొకుల కోసం తెచ్చుకున్న ఒడి బియ్యాన్ని దారిలో సమ్మక రూపంపై వెదజల్లారు. కొందరు భక్తులు ఆ బియ్యాన్ని ఏరుకుని దాచుకున్నారు. సమ్మకను తోడ్కొని వస్తున్న బృందం అకడినుంచి చెలపెయ్య గుడికి చేరుకోగా. వనదేవతకు అక్కడి పూజారులు ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం మేడారం గద్దెలకు బయలుదేరారు. మేడారం గద్దెల ముఖద్వారం వద్ద ఆ ఊరి ఆడబిడ్డలు సమ్మకను తీసుకొస్తున్న పూజారుల కాళ్లు కడిగి స్వాగతం పలికారు. అకడికి చేరుకున్న భక్తులు ఆ అపురూప క్షణాలను చూసి మైమరిచిపోయారు. ఈ ఉద్విగ్న సమయంలో పూజారులు సమ్మకను గద్దెలపైకి చేర్చారు.

30 లక్షల మంది రాక
సమ్మక గద్దెలపైకి వచ్చే సమయంలో ఆవరణలో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. సమ్మక గద్దెలపైకి చేరిన తర్వాత కరెంట్‌ సరఫరా కొనసాగించారు. మొదట మేడారంవాసులు, జిల్లా అధికారులు మొకులు చెల్లించుకున్నారు. నలుగురు వన దేవతలు.. సమ్మక, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెలపైకి చేరడంతో మొకులు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సమ్మక గద్దెలపైకి చేరే రోజు కావడంతో గురువారం ఒకరోజే 30 లక్షల మంది మేడారానికి తరలివచ్చారు.

సమ్మక్క గిరిజన యూనివర్సిటీకి 900 కోట్లు విడుదల

  • ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు

Medaram4

సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.900 కోట్లు విడుదల చేసిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులను ప్రారంభిస్తామని, జాకారం యూత్‌ వైటీసీలో తాత్కాలికంగా తరగలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. గురువారం ఆయన రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి మేడారం మహాజాతరకు హాజరై సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు.

సమ్మక్క-సారలమ్మ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలు

  • సమ్మక్క-సారలమ్మ భక్తులకు కేసీఆర్‌ శుభాకాంక్షలు

Kcr File Pics

తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల పూజలందుకుంటున్న మేడారం సమ్మక-సారలమ్మ మహాజాతర సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద అడవిబిడ్డల జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కొనసాగిన ఆత్మగౌరవ పోరాటంలో, సమ్మక-సారలమ్మ అందించిన స్ఫూర్తి ఇమిడి ఉన్నదని గుర్తుచేశారు.

ఒకనాడు కల్లోలిత ప్రాంతంగా నాటి సమైక్యపాలకుల ఏలుబడిలో అలజడులకు గురైన గోదావరీలోయ పరీవాహక ప్రాంతం నేడు సాగునీటి జీవజలంతో సస్యశ్యామలమై ప్రజల జీవితాల్లో సాంత్వన నింపిందని పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి తల్లుల దర్శనార్థం కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా చూడాలని వనదేవతలను ప్రార్థించారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.