Medaram Jathara | మేడారం జాతరలో అత్యంత ఉద్విగ్నతకు లోనయ్య ఘట్టం సమ్మక్క ఆగమనం ప్రారంభమయ్యింది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి బయల్దేరింది. గురువారం అర్ధరాత్రి అమ్మవారు గద్దెపై కొలువుదీరనుంది.
Medaram Jathara | మేడారం జాతరలో అత్యంత ఉద్విగ్నతకు లోనయ్యే ఘట్టం సమ్మక్క ఆగమనం ప్రారంభమయ్యింది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి బయల్దేరింది. గురువారం అర్ధరాత్రి అమ్మవారు గద్దెపై కొలువుదీరనుంది.
గురువారం సాయంత్రం శివసత్తుల పూనకాలు, డోలు వాయిద్యాలు, గిరిజన యువతుల నృత్యాల నడుమ సమ్మక్క చిలుకలగుట్ట నుంచి బయలుదేరింది. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్యతో సహా ఐదుగురు పూజారులు చిలకలగుట్టపైకి వెళ్లి కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను కిందకు తీసుకొచ్చారు. చిలుకలగుట్ట దిగి గద్దెల వద్దకు బయల్దేరిన సమ్మక్కకు మంత్రి సీతక్క స్వాగతం పలికారు. సమ్మక్క ఆగమనానికి సూచనగా ఆ దేవతను ఆహ్వానిస్తూ ప్రభుత్వం తరఫు అధికారిక లాంఛనాల ప్రకారం జిల్లా ఎస్పీ పి.శబరీశ్ ఏకే-47 గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా చిలుకలగుట్ట ప్రాంతం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. సమ్మక్క మేడారం గద్దెను చేరే అపూర్వ ఘట్టం తిలకించేందుకు భక్తులు వేల కండ్లతో ఎదురుచూస్తున్నారు.
