MI vs CSK : ముంబై ఇండియన్స్ కంచుకోటలో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ బౌండరీల మోత మోగింది. అయితే.. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings) బ్యాటర్లు చితక్కొట్టారు. దాంతో, చెన్నై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల 206 నష్టానికి రన్స్ బాదింది.
MI vs CSK : ముంబై ఇండియన్స్ కంచుకోటలో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ బౌండరీల మోత మోగింది. అయితే.. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings) బ్యాటర్లు చితక్కొట్టారు. వాంఖడే స్టేడియంలో ముంబై బౌలర్లను ఎడాపెడా బాదేసిన శివం దూబే(27), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(69)లు హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. దాంతో, చెన్నై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల 206 నష్టానికి రన్స్ బాదింది. దూబే, గైక్వాడ్ వీరకొట్టుడుకు చివర్లో ఎంఎస్ ధోనీ(20 నాటౌట్) హ్యాట్రిక్ సిక్సర్లు తోడవ్వడంతో ముంబైకి భారీ టార్గెట్ నిర్దేశించగలిగింది.
టాస్ ఓడిన చెన్నైకి ఆదిలోనే కొయేట్జీ షాక్ ఇచ్చాడు. ఓపెనర్‌గా వచ్చిన అజింక్యా రహానే(5)ను వెనక్కి పంపాడు. ఆ తర్వాత నబీ, బుమ్రాలు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో బౌండరీలు రాలేదు. అయితే.. కొయేట్జీ వేసిన ఐదో ఓవర్లో గైక్వాడ్ గేర్ మార్చాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది చెన్నైకి ఊపు తెచ్చాడు. అంతలోనే ఓపెనర్ రచిన్ రవీంద్ర (21) ఇన్నింగ్స్‌కు శ్రేయాస్ గోపాల్ తెరదించాడు.
Scintillating Shivam 😍😍
Relive how Shivam Dube took the attack to Romario Shepherd 💥💥
He continues his good form with the bat with yet another half-century 👏👏
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvCSK | @IamShivamDube | @ChennaiIPL pic.twitter.com/1Uopr5gFBX
— IndianPremierLeague (@IPL) April 14, 2024
ఆ తర్వాత వచ్చిన దూబే జతగా జట్టుకు గైక్వాడ్ ముంబై బౌలర్లను ఉతికేశాడు. ఈ సీజన్‌లో రెండో ఫిఫ్టీతో జట్టుకు భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు 90 రన్స్ జోడించారు. ఈ క్రమంలో రుతురాజ్ ఐపీఎల్‌లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని పాండ్యా విడదీశాడు. దాంతో, ఊపిరి పీల్చుకున్న ముంబైని డారిల్ మిచెల్(17), ధోనీ(20 నాటౌట్)లు వణికించారు. పాండ్యా వేసిన ఆఖరి ఓవర్‌లో ధోనీ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడంతో సీఎస్కే స్కోర్ 200 దాటింది. ముంబై బౌలర్లలో పాండ్యా(43/2) రెండు వికెట్లు పడగొట్టాడు.
𝗠𝗶𝗹𝗲𝘀𝘁𝗼𝗻𝗲 𝗨𝗻𝗹𝗼𝗰𝗸𝗲𝗱 🔓
2️⃣0️⃣0️⃣0️⃣ runs & counting in the IPL for Ruturaj Gaikwad 👏👏
Follow the Match ▶ https://t.co/2wfiVhdNSY#TATAIPL | #MIvCSK | @Ruutu1331 | @ChennaiIPL pic.twitter.com/GjpcOrijvy
— IndianPremierLeague (@IPL) April 14, 2024