MI vs CSK : ఐపీఎల్ 17వ సీజన్ 29వ మ్యాచ్‌లో మరికాసేపట్లో మొదలవ్వనుంది. వరుస విజయాలతో జోరు మీదున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians).. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో తలపడుతోంది.
MI vs CSK : ఐపీఎల్ 17వ సీజన్ 29వ మ్యాచ్‌లో మరికాసేపట్లో మొదలవ్వనుంది. వరుస విజయాలతో జోరు మీదున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians).. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో తలపడుతోంది. వాంఖడేలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ తీసుకున్నాడు. ఇక ఈ కీలక పోరులో చెన్నై ఒక మార్పుతో ఆడుతుండగా.. ముంబై మాత్రం అదే జట్టును కొనసాగిస్తోంది.
ముంబై తుది జట్టు : ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, మహమ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, శ్రేయాస్ గోపాల్, గెరాల్డ్ కొయెట్జీ, బుమ్రా, ఆకాశ్ మధ్వాల్,
సూపర్ కింగ్స్ తుది జట్టు : రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, మహేంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్), శార్ధూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్.
ఇక ఇంప్యాక్ట్ ప్లేయర్ల విషయానికొస్తే.. చెన్నై తరఫున పథిరన, నిశాంత్ సింధు, మిచెల్ శాంట్నర్, మోయిన్ అలీ, షేక్ రషీద్‌లు బరిలో ఉన్నారు. ముంబై జట్టు సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రెవిస్, నమన్ ధిర్, నేహల్ వధేరా, హర్విక్ దేశాయ్‌లను సబిస్టిట్యూట్స్‌గా ప్రకటించింది.