
MI vs RCB : ఐపీఎల్ 17వ సీజన్‌లో హ్యాట్రిక్ ఓటుమలు చవిచూసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు వాంఖడేలో ఆదిలోనే షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ(3) ఔటయ్యాడు. ఆ కాసేపటికే అరంగేట్రం బ్యాటర్ విల్ జాక్స్(8)ను ఆకాశ్ మద్వాల్ వెనక్కి పంపాడు.
దాంతో 23 పరుగులకే ఆర్సీబీ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. రజత్ పాటిదార్ క్రీజులోకి వచ్చాడు. కెప్టెన్ డూప్లెసిస్ 12 పరుగులతో ఆడుతున్నాడు. నాలుగు ఓవర్లకు స్కోర్.. 27/2.
పేసర్లకు అనుకూలించే వాంఖడే పిచ్‌పై పాండ్యా తొలి ఓవర్‌లో స్పిన్నర్ మహమ్మద్ నబీతో వేయించాడు. ఆ తర్వాత గెరాల్డ్ కోయెట్జీ.. ఐదు బంతులకు ఒకటే రన్ ఇచ్చినా.. ఆఖరి బాల్‌ను డూప్లెసిస్ సిక్సర్‌గా మలిచాడు. ఇక మూడో ఓవర్‌ను బుమ్రాతో వేయించిన పాండ్యా ఫలితం రాబట్టాడు.