MLA Sunitha Lakshmareddy | బీజేపీ అధికారంలోకి వొస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నారు. అలాంటి వారికి ఓటుతో బుద్ది చెప్పాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి(MLA Sunitha Lakshmareddy) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మెదక్ : బీజేపీ అధికారంలోకి వొస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నారు. అలాంటి వారికి ఓటుతో బుద్ది చెప్పాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి(MLA Sunitha Lakshmareddy) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం కౌడిపల్లిలో జరిగిన కౌడిపల్లి, చిలిపిచెడ్, కుల్చారం మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మెదక్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో(Venkatrami Reddy) కలిసి మాట్లాడారు.
మెదక్ గడ్డ కేసీఆర్ అడ్డా అని, ఎవరు అడ్డొచ్చినా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమన్నారు.
దేవుని మీద రాజకీయం చేయడం బీజేపీకే చెల్లిందని విమర్శించరాఉ. రఘునందన్ రావు మాయ మాటలు నమ్మని దుబ్బాక ప్రజలు చిత్తుగా ఓడించారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారంటీలు బుట్ట దాఖలు అయ్యాయని, కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలన్నారు.
కౌడిపల్లి మండలంలో పార్టీ శ్రేణులకు కొదువ లేదని, మీకు అండగా నిలుస్తామన్నారు. పార్టీని వీడి పోయే వారు పోతారని, ఉన్నవాల్లే నిజమైన కార్యకర్తలలని పేర్కొన్నారు. తాను పార్టీ మారుతారని దుష్ప్రచారం చేస్తున్నారని, కేసీఆర్ అడుగులో అడుగై ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. వెంకట్రామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.