MLC Kavitha | దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి(Ala Venkateshwar Reddy)ని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha )పరామర్శించారు.
మహబూబ్ నగర్: దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి(Ala Venkateshwar Reddy)ని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha )పరామర్శించారు. జిల్లాలోని అడ్డాకుల మండలం అన్నసాగర్ గ్రామంలో వెంకటేశ్వర్ రెడ్డి ఇంటికి చేరుకున్న కవిత ఆల శశివర్ధన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు(Tribute) అర్పించారు. వెంకటేశ్వర్‌రెడ్డి సోదరుడు శశివర్ధన్ రెడ్డి ఇటీవలే గెండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి తెలిపారు. ఆమె వెంట మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
