Mobile Tariffs | టెలికం కంపెనీలు వివిధ రకాల మొబైల్ సర్వీస్ ప్లాన్ల టారిఫ్ లు పెంచనున్నాయి. ఈ ఏడాదిలో ప్రీపెయిడ్ రీచార్జీ టారిఫ్ లు 15-17 శాతం పెంచనున్నాయి.

Mobile Tariffs | టెలికం కంపెనీలు వివిధ రకాల మొబైల్ సర్వీస్ ప్లాన్ల టారిఫ్ లు పెంచనున్నాయి. ఈ ఏడాదిలో ప్రీపెయిడ్ రీచార్జీ టారిఫ్ లు 15-17 శాతం పెంచనున్నాయి. అంతే కాదు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ తన ప్రీమియం యూజర్లకు అన్ లిమిటెడ్ డేటా నిలిపివేయనున్నాయని ఆంటిక్యూ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఓ నివేదిక వెల్లడించింది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్-జూలై మధ్య టారిఫ్ చార్జీలు పెంచే విషయమై టెలికం సంస్థలు నిర్ణయం తీసుకుంటాయని తెలుస్తున్నది.
కొందరు నిపుణుల అంచనా ప్రకారం మొబైల్ ఫోన్ల రీచార్జింగ్ బిల్లు 20 శాతం వరకూ పెరుగుతుందని తెలుస్తున్నది. 4జీ సేవల కంటే 5జీ సేవలు పొందుతున్న వారిపై అదనంగా 5-10 శాతం చార్జీలు పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో 116.46 కోట్ల మంది మొబైల్ ఫోన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారని టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. గత జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో 39,30,625 మంది మొబైల్ సబ్ స్క్రైబర్లు పెరిగారు. జనవరిలో దేశవ్యాప్త మొబైల్ సబ్ స్క్రైబర్ల సంఖ్య 116.07 కోట్లు.