Mohammad Shami : దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (Mohammad Shami) అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. స్వదేశంలో జరుగబోయే ఇంగ్లండ్ సిరీస్(England Series)కు అందుబాటులో ఉంటానని…
Mohammad Shami : దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ(Mohammad Shami) అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. స్వదేశంలో జరుగబోయే ఇంగ్లండ్ సిరీస్(England Series)కు అందుబాటులో ఉంటానని మంగళవారం ఈ స్పీడ్‌స్టర్ ప్రకటించాడు. ‘టెస్టులు, టీ20ల్లో ఆడుతా. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు అందుబాటులో ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నా’ అని షమీ తెలిపాడు.
అంతేకాదు మేనేజ్‌మెంట్ కోరితే ఈ ఏడాది వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగబోయే టీ20 వరల్డ్ కప్‌లోనూ ఆడాలని ఉందని వెల్లడించాడు. ‘టీ20ల విషయానికొస్తే.. నేను పొట్టి ఫార్మాట్ జట్టులో ఉంటానా? లేదా? అని సందేహం ఉండేది. కానీ, ప్రపంచ కప్ ముందు ఐపీఎల్ ఉంది. స్క్వాడ్‌ను ఎంపిక చేసేందుకు ఈ టోర్నీ ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ మేనేజ్‌మెంట్ కోరితే పొట్టి ప్రపంచ కప్‌లో ఆడుతా’ అని షమీ తెలిపాడు.

వరల్డ్ కప్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న షమీ ప్రస్తుతం బెంగళూరులోని క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్‌కు మెరుగులు దిద్దుకుంటున్నాడు. దాంతో, అతడు తొలి రెండు టెస్టులకు దూరమయ్యే అవకాశముందనే వార్తలు వినిపించాయి. దాంతో, షమీ లేకుంటే ఎలా? అంటూ ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో షమీ తనంతట తానుగా నేను వచ్చేస్తున్నానంటూ టీమిండియాకు తీపి కబురు చెప్పాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జనవరి 25న భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు జరుగనుంది.
అర్జున అవార్డు అందుకున్న షమీ

వన్డే ప్రపంచ కప్‌లో అమోఘంగా రాణించిన షమీ ప్రతిష్థాత్మక అర్జున అవార్డు(Arjuna Award) అందుకున్నాడు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) చేతుల మీదుగా వీళ్లిద్దరూ ఈ అవార్డు స్వీకరించాడు. భారత క్రీడా రంగంలో ఖేల్ రత్నతర్వాత రెండో అత్యుత్తన్నత అవార్డు అందుకున్న షమీ తన కల నిజమైందని అన్నాడు. 2023కు గానూ 26 మంది అర్జున అవార్డు స్వీకరించారు. వీళ్లలో ఆసియా గేమ్స్‌లో పతకాలు కొల్లగొట్టిన అథ్లెట్స్ ఎక్కువ మంది ఉండడం గమనార్హం.
