Mutual Funds | ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తుండటంతో ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరిగిపోయాయి. ఎనిమిది ఈఎల్ఎస్ఎస్, ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో గత నెలలో రూ.1000 కోట్లకు పైగా పెట్టుబడులు పెరిగాయి.
Mutual Funds | ప్రతి ఒక్కరూ కుటుంబ భవిష్యత్ అవసరాల కోసం తమ ఆదాయంలో కొంత మొత్తం పొదుపు చేస్తుంటారు. ఫిక్స్ డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ల వంటి సంప్రదాయ మదుపు పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తారు. ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు రిస్క్ ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు బెటర్ రిటర్న్స్ ఉంటాయి. గత కొంతకాలంగా స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ కూడా మంచి లాభాలే అందిస్తున్నాయి. దీంతో గత మార్చిలో ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు భారీగానే పెట్టుబడులు పెట్టారు.
ప్రత్యేకించి ఎనిమిది ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌లో అత్యధికంగా రూ.1000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని ఏసీఈ ఎంఎఫ్ గణాంకాలు చెబుతున్నాయి. లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఫోకస్డ్ ఫండ్, కాంట్రా ఫండ్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్ క్యాటగిరీల్లో ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడులు పెట్టారు.
ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ ఒక లార్జ్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్‌లో గత ఫిబ్రవరిలో రూ.51,554.28 కోట్ల పెట్టుబడులు పెడితే, మార్చిలో రూ.53,503.33 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంటే మార్చిలో అత్యధికంగా రూ.1,951.05 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఫ్లెక్సీ క్యాప్ క్యాటగిరీలో పరాగ్ పరీఖ్ ఫ్లెక్సీ క్యాప్ అతిపెద్ద స్కీం. గత ఫిబ్రవరిలో రూ.58,900 కోట్ల మేర పెట్టుబడులు వస్తే, మార్చిలో రూ.60,559 కోట్ల పెట్టుబడులు రికార్డయ్యాయి. అంటే గత నెలలో ఇన్వెస్టర్లు ఈ స్కీంలో రూ.1658.92 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
లార్జ్ క్యాప్ స్కీమ్స్ – నిప్పన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ ఉన్నాయి. నిప్పన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్‌లో మార్చిలో రూ.1,611.62 కోట్ల పెట్టుబడులతో మొత్తం స్కీంలో మదుపు చేసిన పెట్టుబడులు రూ.24,378.39 కోట్లు. ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్‌లో రూ.22,766.78 కోట్ల మదుపుతో గత నెల వరకూ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టిన మొత్తం నిధులు రూ.44,819.48 కోట్లకు చేరుకున్నాయి.
మ్యూచువల్ ఫండ్స్‌లో పాపులర్ ఫండ్స్ – ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్, ఎస్బీఐ కాంట్రా ఫండ్. ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌లో రూ.1,454.36 కోట్లతో మార్చి నెలాఖరు నాటికి మొత్తం పెట్టుబడులు రూ.32,190.38 కోట్లకు చేరాయి. ఎస్బీఐ కాంట్రా ఫండ్ లోకి రూ.1451.94 కోట్లతో ఇన్వెస్టర్లు రూ.26,776.87 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ఈఎల్ఎస్ఎస్)లో అతి పెద్ద స్కీం యాక్సిస్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్. ఈ పథకంలో పెట్టుబడులు గత ఫిబ్రవరిలో రూ.34,025.16 కోట్లకు చేరితే, గత నెలలో రూ.1,448.72 కోట్లు పెరిగాయి. దీంతో ఈ ఫండ్ కింద మొత్తం రూ.35,473.88 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో ప్రధానమైన స్కీం హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఈ స్కీంలో గత నెలలో రూ.1,182.98 కోట్ల మేరకు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెడితే, గత నెలాఖరు నాటికి ఈ పథకంలో మొత్తం పెట్టుబడులు రూ.50,839.90 కోట్లకు చేరాయి.