Nikki Haley | అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ప్రైమరీల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు బ్రేక్ పడింది. ఆదివారం జరిగిన వాషింగ్టన్ డీసీ (Washington DC) ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్‌పై భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ (Nikki Haley) ఘన విజయం సాధించారు.
Nikki Haley | అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ప్రైమరీల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు బ్రేక్ పడింది. ఆదివారం జరిగిన వాషింగ్టన్ డీసీ (Washington DC) ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్‌పై భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ (Nikki Haley) ఘన విజయం సాధించారు. దీంతో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న హేలీకి ఈ ఎన్నికల్లో తొలి విజయం దక్కినట్లైంది.
వాషింగ్టన్ డీసీలో ఉన్న 22 వేల ఓట్లలో నిక్కీ హేలీకి 63 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు 33.2 శాతం ఓట్లు వచ్చాయి. ఇక ఇక్కడ 2020లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు 92 శాతం ఓట్లు సాధించారు.
మరోవైపు ట్రంప్ ప్రైమరీల్లో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. శనివారం ఇడాహో, మిస్సోరీ, మిషిగన్‌లో జరిగిన ప్రైమరీలో నిక్కీ హేలీపై ఘన విజయం సాధించారు. దీంతో ఆయనకు మద్దతు పలికే డెలిగేట్ల సంఖ్య 244కు చేరింది. ఆయన ప్రత్యర్థి నిక్కీ హేలీకి 24మంది డెలిగేట్లు మాత్రమే మద్దతిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం రావాలంటే, కనీసం 1,215 మంది డెలిగేట్ల మద్దతు అవసరం. వచ్చే మంగళవారం 16 రాష్ర్టాల్లో ఓటింగ్ జరుగుతుంది.
Also Read..
Arvind Kejriwal | ఈడీ విచారణకు హాజరవుతా : కేజ్రీవాల్
Dharmashala Stadium | ధర్మశాలలో వడగండ్లు, ఎముకలు కొరికే చలి.. ఐదో టెస్టుకు అంతరాయం తప్పదా..!
Lionel Messi | మెస్సీ ఫ్రీ-కిక్ తగిలి గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారి.. వీడియో
