Nothing Phone 2 | ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్-2024 సందర్భంగా నథింగ్ ఫోన్ 2పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గరిష్టంగా రూ.10 వేల డిస్కౌంట్ తోపాటు సెలెక్టెడ్ బ్యాంకు క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేస్తే రూ.3,000 అదనపు డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్ అందిస్తోంది.
Nothing Phone 2 | గతేడాది జూలైలో భారత్ మార్కెట్లోకి ఎంటరైన నథింగ్ ఫోన్2 ఫోన్‌పై కంపెనీ భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. ఈ నెల 14 నుంచి ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్స్ సందర్భంగా డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ ద్వారా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసే వారికి అదనపు బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నట్లు నథింగ్ ఫోన్ 2 తెలిపింది. 12 జీబీ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ మీద మాత్రమే రూ.44,999 నుంచి రూ.34,999లకు తగ్గిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్స్ ప్రారంభమైన తర్వాత ఇతర ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నథింగ్ ఫోన్2 ఫోన్ మూడు ర్యామ్, మూడు స్టోరేజీ ఆప్షన్లలో లభిస్తుంది. డార్క్ గ్రే, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఆవిష్కరణ సమయంలో ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.44,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.49,999, 12 జీబీ ర్యామ్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.54,999గా ప్రకటించింది. బేస్ వేరియంట్ ఫోన్ ధర గత నెలలో రూ.39,999లకు కుదించేసింది.
ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ లో కొనుగోలు చేసిన కస్టమర్లకు నథింగ్ 65వాట్ల జీఏఎన్ చార్జర్ రూ.1999లకు కొనుగోలు చేయొచ్చు. దీని అసలు ధర రూ.2999. ఇక ఈ చార్జర్ సాయంతో నథింగ్ ఫోన్ 2 కేవలం 25 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసే వారికి ప్రత్యేకంగా రూ.2000 డిస్కౌంట్‌తోపాటు అర్హత గల పాత స్మార్ట్ ఫోన్ల ఎక్చ్సేంజ్ ఆఫర్ కింద అదనంగా రూ.3,000 డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుంది.
