NZ vs RSA 2nd Test : స్వదేశంలో దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ (Newzealand)ను విజయం ఊరిస్తోంది. సఫారీ జట్టు నిర్దేశించిన 267 పరుగుల ఛేదనలో కివీస్ ఓపెనర్లు ధాటిగా…

NZ vs RSA 2nd Test : స్వదేశంలో దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ (Newzealand)ను విజయం ఊరిస్తోంది. సఫారీ జట్టు నిర్దేశించిన 267 పరుగుల ఛేదనలో కివీస్ ఓపెనర్లు ధాటిగా ఆడారు. దాంతో, మూడో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 40 పరుగులు చేసిన టిమ్ సౌథీ సేన మరో 227 రన్స్ కొడితే సిరీస్‌ను ఎగరేసుకుపోతుంది.
మూడో రోజు కివీస్ పేసర్ల ధాటికి దక్షిణాఫ్రికా 235 రన్స్‌కే ఆలౌటయ్యింది. విల్ ఓ రూర్కే ఐదు వికెట్లు తీసినప్పటికీ.. యంగ్‌స్టర్ డేవిడ్ బడింగ్‌హమ్(110) శతకంతో చెలరేగడంతో సఫారీ జట్టు ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది.
Will O’Rourke gets the big wicket – David Bedingham sets up South Africa in Hamilton #NZvSA
👉 https://t.co/S8tTDHON3G pic.twitter.com/GZcFsvNDHy
— ESPNcricinfo (@ESPNcricinfo) February 15, 2024
అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టామ్ లాథమ్(21 నాటౌట్), డెవాన్ కాన్వే(17)లు శుభారంభం ఇచ్చారు. ఆఖరి బంతికి డెవాన్ కాన్వే(17)ను ఔట్ చేసి దక్షిణాఫ్రికాకు బ్రేక్ ఇచ్చాడు. దాంతో, కివీస్ మూడో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 40 రన్స్ చేసింది. కివీస్ విజయానికి ఇంకా 227 పరుగులు కావాలి.
A Test five-for on debut to go with four in the first dig – 22 y/o Will O’ Rourke shows serious promise ⚡️#NZvSA pic.twitter.com/GoO9F1pI26
— ESPNcricinfo (@ESPNcricinfo) February 15, 2024
తొలి టెస్టు సెంచరీ హీరోలు కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్రలు బ్యాటింగ్ రావాల్సి ఉంది. దాంతో ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలుపొందడం పెద్ద కష్టమేమి కాదు. ఒకవేళ దక్షిణాఫ్రికా బౌలర్లు అద్భుతం చేస్తే ఇరుజట్లు 1-1తో సిరీస్ సమం చేసుకుంటాయి. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పట్టికలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. ఫైనల్ రేసులో నిలవడం ఖాయం.
ఇవి కూడా చదవండి