Om Bheem Bush | శ్రీవిష్ణు (Sree Vishnu) కాంపౌండ్ నుంచి వస్తున్న కామెడీ డ్రామా ఓం భీమ్ బుష్ (Om Bheem Bush). వరల్డ్ వైడ్‌గా మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. బ్రోచెవారెవరురా కోస్టార్లు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. కొన్ని గంటల్లో ప్రీమియర్ వేయబోతున్న నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయి.
Om Bheem Bush | కంటెంట్‌ను నమ్మి సినిమాలు చేసే హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు శ్రీవిష్ణు (Sree Vishnu). ఈ టాలెంటెడ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తున్న కామెడీ డ్రామా ఓం భీమ్ బుష్ (Om Bheem Bush). వరల్డ్ వైడ్‌గా మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. బ్రోచెవారెవరురా కోస్టార్లు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. కొన్ని గంటల్లో ప్రీమియర్ వేయబోతున్న నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయి.
ఓపెనింగ్ వీకెండ్‌కు సంబంధించిన చాలా షోల బుకింగ్స్ శరవేగంగా పూర్తయ్యాయని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. శ్రీవిష్ణు నటించిన సామజవరగమన సినిమా టీజర్, థ్రియాట్రికల్ ట్రైలర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేసి.. ఘన విజయం సాధించడంలో కీ రోల్ పోషించాయి. ఇప్పుడైతే ట్రెండ్ ఓం భీమ్ బుష్ సినిమా విషయంలో కూడా కొనసాగుతుందని తాజా అప్డేట్తో అర్థమవుతుంది.
హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ సమర్పిస్తోంది. యూవీ సెల్యూలాయిడ్, సునీల్ తెరకెక్కిస్తున్నారు. మిస్టరీ, థ్రిల్ ఎలిమెంట్స్‌తో ఇప్పటివరకూ రాని పాయింట్‌తో సినిమా ఉండబోతుందని ఇప్పటికే శ్రీవిష్ణు క్లారిటీ ఇచ్చాడు.
ఓం భీమ్ బుష్ ట్రైలర్..
ఓం భీమ్ బుష్ టీజర్..
