సంక్రాంతికి బడాహీరోలతో పోటీపడికూడా టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసిందిహనుమాన్ మూవీ. తేజా సజ్జా నటించిన ఈ మూవీకి థియేటర్లలో మంచిఆదరణ లభించింది. అంతేకాదు కలెక్షన్ల సునామీని స్రుష్టించింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విజువల్స్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాయి. ఇక కొంతకాలంగా ఈసినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
మార్చి 17వ తేదీనిఓటీటీ ఫ్లాట్ ఫాం జీ 5 సంస్థ హనుమాన్ సినిమాను స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానులు ఊహించిన దాని కంటే ఎక్కువగా స్ట్రీమ్ చేస్తున్నారు. దీంతో హనుమాన్ బిగ్ స్క్రీన్ లోనే కాదు..ఇటు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను సైతం బద్దలుకొడుతోంది.
అయితే జీ 5లో స్ట్రీమింగ్ ఆవుతున్న హనుమాన్ ఓటీటీలోకి వచ్చిన 11గంటల్లోనే 102 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేసింది. ఒక్క హనుమాన్ సినిమాతో జీ 5 యాప్ పాత రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో తెలుగు రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో ట్రెండింగ్ నెం1 లో ఉంది. సమయం గడిచే కొద్దీ హనుమాన్ మరిన్ని రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు. అయితే తెలుగు రిలీజ్ కే ఇంతంటి క్రేజ్ వస్తుందంటే ఇతర భాషల్లోనూ రిలీజ్ చేస్తే దాని ఊపు ఏ రేంజ్ లో ఉంటుందో ఉహించలేం అంటున్నారు ప్రేక్షకులు.
RECORDS BROKEN AND HEARTS WON! HanuMan now streaming on ZEE5 in Telugu with English subtitles.
https://t.co/TfUtuuoNTx @tejasajja123 @PrasanthVarma @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Chaitanyaniran @GowrahariK @AsrinReddy @Primeshowtweets @tipsofficial pic.twitter.com/8EymDJjKbU— ZEE5 Telugu (@ZEE5Telugu) March 18, 2024
ఇది కూడాచదవండి: హైదరాబాద్లో చల్లపడ్డ వాతావరణం.. పలు చోట్ల వర్షం
The post OTTలోనూ దూసుకుపోతున్న హనుమాన్..11గంటల్లోనే రికార్డులన్నీ బ్రేక్.! appeared first on tnewstelugu.com.
