Pahal Foods Company | రంగారెడ్డి(Rangareddy) జిల్లాలోని పహల్ ఫుడ్స్ కంపెనీలో(Pahal Foods Company) భారీ అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది.
హైదరాబాద్: రంగారెడ్డి(Rangareddy) జిల్లాలోని పహల్ ఫుడ్స్ కంపెనీలో(Pahal Foods Company) భారీ అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. ఫుడ్స్ ఫ్యాక్టరీలోని మూడు అంతస్థులకు మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో వంద మందికి పైగా సిబ్బంది ఉన్నారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు.
వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిప్రమాదం ధాటికి పగుళ్లతో పూర్తిగా పక్కకు భవనం ఒరిగింది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
