Pandem kodi | పందెంకోడి(Pandem kodi)కి వేలం వేయడానికి కరీంనగర్(karimnagar) టు డిపో అధికారులు(RTC officials) సిద్ధమయ్యారు.
కరీంనగర్ : పందెంకోడి(Pandem kodi)కి వేలం వేయడానికి కరీంనగర్(karimnagar) టు డిపో అధికారులు(RTC officials) సిద్ధమయ్యారు. ఈనెల తొమ్మిదో తేదీన గుర్తు తెలియని ప్రయాణికుడు పందెంకోడిని బస్సులో మర్చిపోయాడు. దానిని తీసుకోవడానికి గత మూడు రోజులుగా ఎవరూ రాలేదు. దీంతో అధికారులు పందెంకోడిని వేలం వేయడానికి తేదీ ఖరారు చేశారు. శుక్రవారం(రేపు) మధ్యాహ్నం 3 గంటలకు డిపో కార్యాలయంలో బహిరంగ వేలం వేసేందుకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గలవారు ఈ వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.

