PBKS vs RR : స్వల్ప ఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు తనుష్ కొటియాన్(18), యశస్వీ జైస్వాల్(23)లు ఆచితూచి ఆడుతున్నారు. పంజాబ్ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో బౌండరీలు రావడం గగమనమైంది.

PBKS vs RR : స్వల్ప ఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు తనుష్ కొటియాన్(18), యశస్వీ జైస్వాల్(23)లు ఆచితూచి ఆడుతున్నారు. పంజాబ్ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో బౌండరీలు రావడం గగమనమైంది. మూడో ఓవర్ వరకూ ఇద్దరూ కలిసి 16 పరగులు చేశారు. ఆ తర్వాత అర్ష్‌దీప్ బౌలింగ్‌లో యశస్వీ గేర్ మార్చాడు. కొటియాన్ సైతం బౌండరీతో చెలరేగాడు. రబడ వేసిన ఆరో ఓవర్లో యశస్వీ ఒక ఫోర్ కొట్టాడు. దాంతో 6 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్..43/0.
నిలకడలేమికి తమను మించినోళ్లు లేరని పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు మరోసారి చాటుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ కేశవ్ మహరా(232), అవేవ్ ఖాన్(34జ2)ల ధాటికి స్టార్ ఆటగాళ్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే.. ఇంప్యాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ(31) ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. వికెట్ కీపర్ జితేశ్ శర్మ(29), లివింగ్‌స్టోన్(21)లు కూడా దంచడంతో పంజాబ్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. సామ్ కరన్ సేన నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 రన్స్ కొట్టింది.