Petrol-Diesel Price | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) లక్షద్వీప్ దీవుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను భారీ తగ్గించింది. మారుమూల ద్వీపాలకు ఇంధనాన్ని రవాణా చేయడానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించిన వ్యవయాన్ని తిరిగి పొందేందుకు ధరలను ఐఓసీ పెంచింది.
Petrol-Diesel Price | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) లక్షద్వీప్ దీవుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను భారీ తగ్గించింది. మారుమూల ద్వీపాలకు ఇంధనాన్ని రవాణా చేయడానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించిన వ్యవయాన్ని తిరిగి పొందేందుకు ధరలను ఐఓసీ పెంచింది. తాజాగా ఆ ధరలను ఐఓసీ తగ్గించింది. ఆండ్రోట్, కల్పేని దీవుల్లో లీటర్‌కు రూ.15.3, కవరత్తి, మినీకాయ్ దీవుల్లో రూ.5.2 చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి.
కవరత్తి, మినీకాయ్‌లో లీటర్ పెట్రోల్ రూ.105.94 నుంచి రూ.100.75కి, అందరోట్, కల్పేనిలో రూ.116.13 నుంచి రూ.100.75కి తగ్గింది. కవరత్తి, మినీకాయ్‌లో లీటర్ డీజిల్ ధర రూ.110.91 నుంచి రూ.95.71కి.. అందరోట్, కల్పేనిలో లీటర్ రూ.111.04 నుంచి రూ.95.71కి తగ్గించింది. కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయని పెట్రోలియం-సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. లక్షద్వీప్‌లోని ఐఓసీ నాలుగు దీవులకు కవరత్తి, మినీకాయ్, ఆండ్రోట్, కల్పేని దీవులకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తోంది.
కవరత్తి, మినికాయ్‌లో ఐఓసీకి డిపోలున్నాయి. ఈ డిపోలకు పెట్రోల్, డీజిల్ సరఫరా కొచ్చి నుంచి సాగుతుంది. లక్షద్వీప్, కరత్తి, మినీకాయ్ దీవుల్లో డిపోలు నిర్మించగా.. దీనికి వెచ్చించిన సొమ్మును రికవరీ చేసేందుకు డీజిల్, పెట్రోల్ ధరలను లీటరుకు రూ.6.90 పెంచారు. డిపో నిర్మాణాల ఖర్చును మూడేళ్లుగా రికవరీ చేస్తున్నది. మూలధన వ్యయం పూర్తిగా రికవరీ అయ్యిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దాంతో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయించారు.
