Phone tapping | ఫోన్ ట్యాపింగ్(Phone tapping) కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ఉదయం 10 గంటలకు పోలీసులు జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు.

హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్(Phone tapping) కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును( Radhakishan Rao) పోలీసు కస్టడీలో(Police custody) దర్యాప్తు బృందం 6 రోజుల పాటు విచారించింది. నేటితో ఆయన విచారణ ముగియనుంది. దీంతో బుధవారం ఉదయం 10 గంటలకు రాధాకిషన్‌రావును పోలీసులు జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు.
కాగా, ప్రణీత్‌రావుతో కలిసి రాధాకిషన్ రావు ఈ కేసులో ఆధారాలు ధ్వంసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దిశగా పోలీసులు ఆయనను లోతుగా విచారించినట్టు సమాచారం. రాధాకిషన్ వాంగ్మూలం ఆధారంగా మరికొందరికి పోలీసులు నోటీసులిచ్చే అవకాశం ఉంది.