Prithviraj Sukumaran | పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నటించిన The Goat Life మార్చి 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజా చిట్‌చాట్ పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన కామెంట్స్ టాలీవుడ్ మూవీ లవర్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి.
Prithviraj Sukumaran | భారత చలన చిత్ర పరిశ్రమలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ల జాబితాలో టాప్‌లో ఉంటాడు పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). ఈ మాలీవుడ్ స్టార్ హీరో నటించిన The Goat Life మార్చి 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజా చిట్‌చాట్‌లో పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన కామెంట్స్ టాలీవుడ్ మూవీ లవర్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి.
టాలీవుడ్లో ఎవరిని డైరెక్ట్ చేయాలనుందని అడిగితే.. తనకు ప్రభాస్, బాలకృష్ణ (Balakrishna)తో కలిసి పని చేయాలనుందని చెప్పాడు. బాలకృష్ణతో పనిచేయడంపై మాట్లాడుతూ.. బాలకృష్ణను రియలిస్టిక్ సినిమాలో చూడాలని అనుకుంటున్నా. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా ఉండకుండా.. రియలిస్టిక్ మలయాళీ కమర్షియల్ సినిమాగా బ్రో డాడీ లైన్లో ఉండాలి. బాలకృష్ణ సార్ సాధారణంగా భారీ కమర్షియల్ సినిమాలను చేస్తుంటారు. నేనిటీవలే ఆయనతో చర్చించానని చెప్పుకొచ్చాడు పృథ్విరాజ్ సుకుమారన్.
మరి బాలయ్యకు పృథ్విరాజ్ సుకుమారన్ కథ ఏమైనా చెప్పాడా..? రాబోయే రోజుల్లో బాలయ్య-పృథ్విరాజ్ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందా..? అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాలి. బాలకృష్ణ అద్భుతమైన నటుడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొంతమంది దర్శకులు మాత్రమే ఆయనలోని మరో యాంగిల్‌ను చూపించగలుగుతారు. ఒకవేళ పృథ్విరాజ్-బాలయ్య కాంబో సెట్ అయితే ఖచ్చితంగా అది అఖండను మించిన భారీ హిట్టవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ డైరెక్షన్లో ఎన్బీకే 109లో నటిస్తుండగా.. షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.
