Raghunandan Rao | మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.
Raghunandan Rao | మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. మాజీ మంత్రి హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఇటీవల ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ను ఫిర్యాదును అందజేశారు. బీఆర్‌ఎస్ నేతలనుద్దేశించి ఆయన చేసిన వ్యాఖలపై పోలీసులతో పాటు ఈసీకి చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేయగా.. సంగారెడ్డి స్టేషన్‌లో కేసు నమోదైంది.
