
RCB vs SRH : చిన్నస్వామి స్టేడియంలో బౌండరీల మోత మోగిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad) ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీ బాదాడు. ఈ విధ్వంసక ఓపెనర్ 39 బంతుల్లోనే 9 ఫోర్లు, 8 సిక్సర్లతో వంద పూర్తి చేసుకున్నాడు. విజయ్ కుమార్ ఓవర్లో బౌండరీతో హెడ్ శతకానికి చేరువయ్యాడు. దాంతో, ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన నాలుగో ఆటగాడిగా హెడ్ రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ వీరుల జాబితాలో క్రిస్ గేల్ టాప్‌లో ఉన్నాడు. ఈ మాజీ ఓపెనర్ 30 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఇక యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో వంద కొట్టి రెండో స్థానంలో నిలవగా.. డేవిడ్ మిల్లర్ కేవలం 38 బంతుల్లోనే శతకం సాధించాడు.
𝗠𝗮𝗶𝗱𝗲𝗻 𝗜𝗣𝗟 𝗛𝘂𝗻𝗱𝗿𝗲𝗱!
A century off just 39 deliveries for Travis Head
4th Fastest in IPL history!
Follow the Match
https://t.co/OOJP7G9bLr#TATAIPL | #RCBvSRH pic.twitter.com/25mCG5fp4C
— IndianPremierLeague (@IPL) April 15, 2024
సెంచరీతో హైదరాబాద్‌కు భారీ స్కోర్ అందిచిన హెడ్ ఫెర్గూసన్ ఓవర్లో భారీ షాట్ ఆడి ఔటయ్యాడు. మిడ్‌వికెట్‌లో డూప్లెసిస్ క్యాచ్ పట్టడంతో హెడ్ తుఫాన్‌కు తెరపడింది. ప్రస్తుతం హెన్రిచ్ క్లాసెన్(26), ఎడెన్ మర్క్‌రమ్(1)లు ఆడుతున్నారు. 13 ఓవర్లలోనే హైదరాబాద్ రెండు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
Clearing them with ease
Travis Head is taking it
at the Chinnaswamy
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia
#TATAIPL | #RCBvSRH | @SunRisers pic.twitter.com/kjKnRqLSNv
— IndianPremierLeague (@IPL) April 15, 2024