
RCB vs SRH : ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun risers Hyderabad) ఊచకోతకు రికార్డులు మోకరిల్లుతున్నాయి. ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్ల వీరకొట్టుడుకు రికార్డులు షేక్ అవుతున్నాయి. సోమవారం రాత్రి ట్రావిస్ హెడ్(102), హెన్రిచ్ క్లాసెన్(69)ల బౌండరీల ప్రవాహంతో చిన్నస్వామి స్టేడియం తడిసిముద్దైంది. సన్‌రైజర్స్ హిట్టర్ల పవర్ పంచ్‌కు ఐపీఎల్ అత్యధిక స్కోర్ రికార్డు రెండు సార్లు బద్ధలు కాగా.. సొంత మైదానంలో గెలుపు రుచి చూడాలనుకున్న రాయల్ చాలెంజర్స్‌కు గుండెకోతే మిగిలింది.
హైదరాబాద్ బ్యాటర్లు సునామీల విరుచుకుపడడంతో నీరుగారిపోయిన ఆర్సీబీ.. లక్ష్య ఛేదనలో మాత్రం గట్టిగానే పోరాడింది. మిడిలార్డర్ విఫలమైనా.. దినేశ్ కార్తిక్(81), కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(62)లు శక్తిమేరకు ఆడినా సరిపోలేదు. కమిన్స్(3/43) నిప్పులు చెరగగా హైదరాబాద్ 25 పరుగులతో గెలుపొంది హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది.
When Captain dismissed Captain in the chase
Recap Pat Cummins’ crucial strike of Faf Du Plessis
#TATAIPL | #RCBvSRHhttps://t.co/KM7ACk9ZuR
— IndianPremierLeague (@IPL) April 15, 2024
ఇలా వచ్చి అలా..
ఐదో ఓటమి తప్పించుకోవాలనుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కల కల్లలైంది. అసలే.. రికార్డు ఛేదనలో ఓపెనర్లు విరాట్ కోహ్లీ(42), కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(62)లు అదిరే ఆరంభమిచ్చారు. అయితే.. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మయాంక్ మార్కండే .. విరాట్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 80 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ ఆ తర్వాత డీలా పడింది. మిడిలార్డర్ బ్యాటర్లు విల్ జాక్స్(9), రజత్ పాటిదార్(9), సౌరవ్ చౌహన్(0)లు ఇలా వచ్చి అలా వెళ్లారు.
up for @RCBTweets
Fifty up for Captain @faf1307
Follow the Match
https://t.co/OOJP7G9bLr#TATAIPL | #RCBvSRH pic.twitter.com/ipzQNET1HQ
— IndianPremierLeague (@IPL) April 15, 2024
కమిన్స్, మార్కండే విజృంభణతో 122 పరుగులకే సంగ వికెట్లు పడిన ఆర్సీబీని దినేశ్ కార్తిక్(81), మహిపాల్ లొమ్‌రోర్(19)లు ఆదుకున్నారు. ఈ ఇద్దరూ బౌండరీలతో చెలరేగి హైదరాబాద్ ఫీల్డర్లను పరుగులు పెట్టించారు. అయితే.. 59 రన్స్ కలిపిన ఈ జోడిని కమిన్స్ వీడదీసినా.. కార్తిక్ విధ్వంసాన్ని కొనసాగించాడు. సెంచరీ దిశగా వెళ్తున్న అతడిని ఉనాద్కాత్ వెనక్కి పంపి ఆర్సీబీ ఓటమిని పరిపూర్ణం చేశాడు.
83 off just 35
The ask is too high for @RCBTweets but this has been a stellar knock from @DineshKarthik!
Follow the Match
https://t.co/OOJP7G9bLr#TATAIPL | #RCBvSRH pic.twitter.com/UQNFBjjj9U
— IndianPremierLeague (@IPL) April 15, 2024
హెడ్ రికార్డు సెంచరీ
తొలుత ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి తన ఉగ్రరూపాన్ని చూపించింది. ఉప్పల్ స్టేడియంలో ముంబైపై 277 పరుగులతో చరిత్ర సృష్టించిన ఆరెంజ్ ఆర్మీ తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ 287 రన్స్ కొట్టింది. ఈసారి హైదరాబాద్ బ్యాటర్ల ఊచకోతకు చిన్నస్వామి స్టేడియం బౌండరీలతో దద్దరిల్లిపోయింది. అభిషేక్ శర్మ(34) తక్కువకే వెనుదిరిగినా.. విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) రికార్డు సెంచరీ బాదాడు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్(69) తన మార్క్ షాట్లతో ఆర్సీబీ బౌలర్లను మరింత వేదనకు గురి చేస్తూ అర్ద శతకంతో గర్జించాడు.
500 sixes into the season already!
Heinrich Klaasen and @SunRisers have set their eyes set on a mighty first-innings total!
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia
#TATAIPL | #RCBvSRH pic.twitter.com/zO3x7xoG6F
— IndianPremierLeague (@IPL) April 15, 2024
హెడ్, క్లాసెన్‌లు భారీ స్కోర్‌కు పునాది వేయగా.. చివర్లో మర్క్‌రమ్(32 నాటౌట్), అబ్దుల్ సమద్(37 నాటౌట్)లు చితక్కొట్టారు. టాప్లే వేసిన 19వ ఓవర్‌లో అబ్దుల్ సమద్(37 నాటౌట్) వరుసగా 4, 4, 6, 6, 4 బాదాడు. ఇక 20వ ఓవర్‌లో.. మర్క్‌రమ్ ఫోర్, రెండు సిక్సర్లు బాదడంతో ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోర్ నమోదు చేసింది. దాంతో, కమిన్స్ సేన ఆర్సీబీకి దాదాపు అసాధ్యమైన భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది