
RR vs GT | జైపూర్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్‌కు వరుస షాకులు తగిలాయి. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లను కోల్పోయింది. 11వ ఓవర్‌లో మాథ్యూ, అభినవ్ వరుసగా ఔటయ్యారు.
కాగా, గుజరాత్ X రాజస్థాన్ మ్యాచ్‌కు 10వ ఓవర్‌లో వర్షం అంతరాయం కలిగించింది. 10 ఓవర్లు ముగిసిన అనంతరం మైదానంలో చినుకులు మొదలయ్యాయి. దీంతో పిచ్‌పై కవర్లు కప్పి మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు. ఆ తర్వాత మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే గుజరాత్ రెండు వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (37), విజయ్ శంకర్ (4) ఉన్నారు. 11 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోర్ 84/3. గుజరాత్ గెలవాలంటే 54 బంతుల్లో 114 పరుగులు చేయాల్సి ఉంది.